Home

»

Gossips

దాసరి..పవన్ మధ్యలో జగన్

Jan 6, 2016 10:44AM

గత కొంతకాలంగా టాలీవుడ్ లో పవన్ - దాసరి కాంబినేషన్ లోని మూవీ గురించి ఆసక్తిగా చర్చలు సాగుతున్నాయి. దాసరి ఆర్థిక ఇబ్బందుల్లో వున్న సమయంలో పవన్ బాసటగా నిలుస్తానని ముందుకొచ్చారు. దాసరి నిర్మాతగా ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే ఆ ప్రాజెక్టు పై స్టొరీ డిస్కషన్స్ ఇప్పటికీ సాగుతున్నాయి.

ప్రస్తుతం పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత దాసరితో సినిమాకి మొదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ పరిణామం నేపథ్యంలో పవన్ తో దాసరి సినిమా ఉంటుందా? లేదా? ఆసక్తికరంగా మారింది.

నిన్న జగన్ మోహన్ రెడ్డి  దాసరిని కలిసారు. ఇద్దరూ దాదాపు గంటసేపు మంతనాలు సాగించడం ఇటు ఇండస్ట్రీ లో పెద్ద చర్చగా మారింది. దాసరి వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారా? అనే సందేహాలు మొదలైయాయి. దీంతో ప్రస్తుతం టీడీపీకి సపోర్టునిస్తున్న పవన్ ప్రత్యర్థికి సపోర్టునిచ్చే దాసరితో చేతులు కలుపుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com