
- పెళ్లిపీటలు ఎక్కుతున్న అనుష్క శెట్టి
- ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా?
- వరుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ 'లేడీ సూపర్ స్టార్' అనుష్క శెట్టి(Anushka Shetty) పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఆమె వివాహం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ, ఈసారి మాత్రం పెళ్లి దాదాపు ఖాయమైందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, సదరు వ్యాపారవేత్త కుటుంబం అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితులని సమాచారం.
అనుష్క స్వతహాగా మంగళూరుకు చెందిన కన్నడ అమ్మాయి కావడంతో, తన సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తితోనే ఏడడుగులు వేయడానికి మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అనుష్క వయసు 44 ఏళ్లు. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పెళ్లి అంటూ అనేక రూమర్లు వచ్చినప్పటికీ, వారిద్దరూ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
'బాహుబలి' తరువాత అనుష్క సినిమాలు తగ్గించింది. మూవీ ప్రమోషన్స్ లోనూ కనిపించడంలేదు. గతేడాది అనుష్క నటించిన 'ఘాటి' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'కథనార్' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం.
అనుష్క తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే, ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు ముగిశాయని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా వెల్లడిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ఇదే కానుంది.
Also Read: ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన నిర్మాత కన్నుమూత






