Home

»

Gossips

హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ మూవీ.. హోంబలే ఫిలిమ్స్ అదిరిపోయే స్కెచ్.!

Jul 4, 2026 4:00PM

కేజీఎఫ్, సలార్, కాంతార వంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హోంబలే ఫిలిమ్స్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటిన పరశురామ్, క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా డీల్ చేయగలరని పేరు తెచ్చుకున్నారు. అందుకే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత 'ఫ్యామిలీ స్టార్'తో నిరాశపరిచిన పరశురామ్.. కొంతకాలంగా హీరో కోసం వెతుకుతున్నారు. అలాంటిది హృతిక్ రోషన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందనే న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

హృతిక్ రోషన్ తో చేయనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం పరశురామ్ తో హోంబలే ఫిలిమ్స్ చర్చలు జరుపుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. హృతిక్ రోషన్ ఇంటెన్సిటీకి, పరశురామ్ బుజ్జి మార్క్ స్క్రీన్‌ప్లే తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com