పవన్ సినిమాకి చిరు-మోహన్ బాబు సినిమా టైటిల్?!
on Oct 26, 2020
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటెర్టైనెంట్స్ నుండి ప్రకటన వచ్చింది. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.
మలయాళంలో బిజూ మీనన్ పోషించిన పోలీస్ పాత్రను పవన్ చేయనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిర్మాతలు ఆ సంగతి అధికారికంగా ప్రకటించలేదు. విజయ దశమి సందర్భంగా పవన్ హీరోగా సినిమా నిర్మిస్తున్నట్టు మాత్రమే ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ టీజర్లో తమన్ నేపథ్య సంగీతాన్ని నిశితంగా గమనిస్తే... 'బిల్లా - రంగా' సౌండ్ వినబడుతుంది.
'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కి 'బిల్లా - రంగా' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దాంతో సినిమాలో బిల్లా ఎవరు? రంగా ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. గతంలో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా 'బిల్లా రంగా' అని ఓ సినిమా వచ్చింది. అందులో బిల్లా పాత్రలో చిరు, రంగా పాత్రలో మోహన్ బాబు నటించారు. సో... బిల్లా పాత్రలో పవన్ కనిపిస్తారని ఊహించవచ్చు.
Also Read