రవితేజతో వెంకీ చిత్రం?
on Aug 2, 2021
`ఛలో`, `భీష్మ` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఈ నేపథ్యంలో.. వెంకీ తదుపరి సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పలువురు అగ్ర కథానాయకుల కాంబినేషన్ లో వెంకీ పేరు వినిపించినా.. ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ఈ క్రమంలోనే.. ఇప్పుడు మరో స్టార్ హీరో కాంబినేషన్ లో వెంకీ పేరు వినిపిస్తోంది. ఆ స్టార్ మరెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ. ఇటీవల రవితేజని సంప్రదించి వెంకీ కుడుముల ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ వినిపించాడట. తన ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండడంతో.. రవితేజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని వినికిడి. త్వరలోనే రవితేజ, వెంకీ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ చేతిలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలున్నాయి. వీటిలో `ఖిలాడి` (రమేశ్ వర్మ దర్శకుడు) చిత్రీకరణ తుది దశలో ఉండగా.. `రామారావు ఆన్ డ్యూటీ` (శరత్ మండవ దర్శకుడు) ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే వెంకీ కుడుముల కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. మరోవైపు.. త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ లోనూ రవితేజ ఓ సినిమా చేయబోతున్నారు.