మెగా షాక్.. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్!
on Feb 8, 2026

ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో భారీ విజయాన్ని అందుకొని, ఫుల్ జోష్ లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఇదే రిజల్ట్ ని 2027 సంక్రాంతికి రిపీట్ చేయాలని చూస్తున్నారు. చిరంజీవి తన 158వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2027 సంక్రాంతిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.
గతేడాది 'ఓజీ'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్టే ఈ వేసవిలో డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు వినికిడి.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఉగాదికి మూవీని లాంచ్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రావడం ఖాయమే అంటున్నారు. దీంతో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేసారి విడుదలవుతాయన్న వార్త ఆసక్తికరంగా మారింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



