మెగాస్టార్ మూవీలో అనుష్క.. ఫ్యాన్స్ కి పండగే!
on Jan 11, 2022
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే 'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి.. 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్', డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్ తో పాటు 'ఛలో', 'భీష్మ' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించనుందని న్యూస్ వినిపిస్తోంది.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. బాహుబలి తర్వాత కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనుష్క పేరు తెరపైకి వచ్చింది. మూవీ టీమ్ ఇప్పటికే అనుష్కని సంప్రదించిందని, అనుష్క కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ మూవీలో అనుష్క హీరోయిన్ గా నటించనుందన్న వార్త నిజమైతే ఆమె ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. మొదట్లో గ్లామర్ రోల్స్ చేసిన అనుష్క.. బాహుబలి తర్వాత ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువగా చేసింది. కొంతకాలంగా అసలు సినిమాలే తగ్గించింది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా అంటే అనుష్క ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
Also Read