Home

»

Gossips

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నవంబర్ 12న?.. ఎక్కడో తెలుసా?

Jul 11, 2026 6:43PM

కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ గట్టిగా చెప్తున్నాయి.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... వీరి వివాహ వేడుకలు ఈ ఏడాది నవంబర్ 11, 12, 13 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా నవంబర్ 12న వీరి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ వెడ్డింగ్ కోసం ఒక విభిన్నమైన లొకేషన్‌ను ఎంచుకున్నారట. ఇండియాలో కాకుండా, ప్రకృతి అందాలకు నిలయమైన సౌత్ ఆఫ్రికాలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.

గతంలో వీరిద్దరిపై ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ... ఇటీవల అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో వీరి పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని టాక్.

అయితే, ఈ మూడు రోజుల వివాహ వేడుకలు మరియు సౌత్ ఆఫ్రికా డెస్టినేషన్ వెడ్డింగ్ వార్తలపై అటు మారన్ ఫ్యామిలీ కానీ, ఇటు అనిరుధ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉన్న ఈ మెగా వెడ్డింగ్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఇరు వర్గాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com