Home

»

Gossips

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? తెరవెనుక పీకే వ్యూహాలు.!

Jul 10, 2026 10:02AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా అనే చర్చ రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వెండితెరపై తనదైన నటన, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేసేందుకు బలమైన పునాది వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అందరిలా కాకుండా అత్యంత వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం దళపతి విజయ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. 

ఈ క్రమంలోనే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌(PK)తో  అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారనే న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ గ్లామర్ మాత్రమే రాజకీయాల్లో గెలుపును తెచ్చిపెట్టదని బాగా నమ్మే బన్నీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకునేందుకు పీకే టీమ్ సహాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు ఏమిటి? భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అనే అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం భావోద్వేగాలతో కాకుండా, పక్కా డేటా, నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికల ఆధారంగానే బన్నీ తన పొలిటికల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

ఈ భారీ పొలిటికల్ ప్లాన్ వెనుక అల్లు అర్జున్ మామగారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా మారాయని తెలుస్తోంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన, తన అల్లుడిని ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేసేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడా తొందరపాటు పనికిరాదని, సరైన సమయం చూసి జనాల్లోకి వెళ్లాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. 

మరి ఈ వార్తల్లో నిజమెంత? అల్లు అర్జున్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు నిజమేనా? త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

 

 

Allu Arjun, Political Entry, Prashant Kishor, Andhra Pradesh

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com