AA22: బన్నీ-అట్లీ సినిమాకి అదిరిపోయే టైటిల్!
on May 26, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కేవలం అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు వినికిడి. తాజాగా ఈ సినిమాకి అదిరిపోయే టైటిల్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. (AA22)
బన్నీ-అట్లీ కాంబో మూవీకి 'ఐకాన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు. కానీ, ఏవో కారణాల పట్టాలెక్కలేదు. అయితే ఐకాన్ టైటిల్ ఎంతగానో నచ్చిన బన్నీ.. ఆ టైటిల్ ను అట్లీ ప్రాజెక్ట్ కి సూచించినట్లు వినికిడి.
అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. పైగా 'ఐకాన్' అనేది యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యాచీ టైటిల్. అందుకే ఇదే టైటిల్ ను లాక్ ఫిక్స్ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు టాక్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
