Home

»

Featured News

శోభన్‌బాబు, జయలలిత కలిసి ఒకే ఒక్క సినిమా చేశారు.. మరి ఆ రూమర్స్ ఎలా వచ్చాయి?

Feb 23, 2026

(ఫిబ్రవరి 24 జయలలిత జయంతి సందర్భంగా..)

 

శోభన్‌బాబు, జయలలిత ప్రేమకథ నిజమేనా?
జయలలిత ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌కి కొదవే ఉండదు. ఇప్ప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించింది కాబట్టి చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతుంది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ప్రింట్ మీడియా తప్ప మరో ప్రచార సాధనం లేదు. ఆ సమయంలో కూడా రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉండేవి. కేవలం ఇలాంటి వార్తలు మాత్రమే ప్రచురించే కొన్ని పత్రికలు కూడా అప్పట్లో ఉండేవి. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నంత ఫాస్ట్‌గా కాకపోయినా వార్త మాత్రం అందరికీ చేరేది. శోభన్‌బాబు(Sobhan Babu), జయలలిత(Jayalalitha) గురించి అలాంటి రూమర్స్ బాగా ప్రచారమయ్యాయి.

శోభన్‌బాబు ఇండస్ట్రీకి వచ్చి హీరోగా నిలదొక్కుకునే సమయానికే జయలలిత బిజీ హీరోయిన్. ఒక నిర్మాత శోభన్‌బాబు, జయలలిత కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలనుకున్నారు. ఇదే విషయం శోభన్‌బాబుకి చెబితే ఆయన ఎంతో సంతోషించారు. ఎందుకంటే అలాంటి టాప్ హీరోయిన్‌తో సినిమా చేస్తే తన కెరీర్‌కి బాగా ఉపయోగపడుతుందనుకున్నారు. అంతా ఓకే అనుకునే సమయానికి జయలలిత తల్లి సంధ్య చిన్న హీరోతో సినిమా ఎందుకు అని ఒప్ప్పుకోలేదు. అలా ఆ ప్రాజెక్ట్ నుంచి శోభన్‌ను తప్పించారు. 

 

చెల్లెలి కాపురం, జీవనతరంగాలు, శారద, తాసిల్దారుగారి అమ్మాయి, కాలం మారింది వంటి సినిమాలతో శోభన్‌బాబు హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి ‘డాక్టర్‌బాబు’ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ చిత్రానికి ఆయన కుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి శోభన్‌బాబు, జయలలితలను హీరోహీరోయిన్లుగా ఎంపిక చేశారు. అలా మొదటిసారి ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమా చేసే సమయానికి జయలలిత తల్లి సంధ్య మరణించారు. 

 

తల్లి మరణంతో కుంగిపోయిన జయలలిత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. సినిమాలు తగ్గించుకున్నారు. ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆమెకు ధైర్యం చెప్పి సినిమాలు కొనసాగించమని చెప్పారు. కొంతకాలం తర్వాత తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన సినిమాయే ‘డాక్టర్ బాబు’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శోభన్, జయలలిత మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనపై శోభన్ చూపిస్తున్న ఆప్యాయత, అభిమానం జయలలితను బాగా ఆకట్టుకున్నాయి. తల్లి లేదనే బాధను శోభన్ మరిపించారు. అలా జరుగుతున్న సమయంలో వీరిద్దరి సాన్నిహిత్యంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే అందులో రకరకాల వెర్షన్లు మనకు కనిపిస్తాయి. అందులో ఏది నిజం అనేది మాత్రం ఎవరికీ తెలీదు. 

 

చేసింది ఒక్క సినిమా అయినా ఇద్దరూ ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివరి క్షణంలో శోభన్‌బాబు అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఆయనకు పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకోలేనని జయలలితకు చెప్పారు శోభన్. ఈ విషయం తమిళ స్టార్ హీరో ఎం.జి.ఆర్.కి తెలిసింది. శోభన్‌బాబుని పిలిపించారు. జయలలితను ఎందుకు  పెళ్లి చేసుకోనని చెప్పావు అని అడిగారు. ఆమెకు చెప్పిన సమాధానమే ఎంజిఆర్‌కి కూడా చెప్పారు శోభన్. అక్కడితో వారి పెళ్లి ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడింది. ఇది ఒక వెర్షన్ అయితే మరో వెర్షన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.

 

డాక్టర్‌బాబు సినిమా చేసిన తర్వాత ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారని, ఇద్దరూ ఒకే గదిలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఈ విషయాలన్నీ ఇండస్ట్రీలో ఉన్నవారికి బాగా తెలుసు. శోభన్, జయలలిత సహజీవనం చేయడం వల్ల వారికి ఒక కుమార్తె కూడా కలిగిందనే ప్రచారం ఉంది. అయితే ఆ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. శోభన్‌బాబుతో పెళ్లి విఫలమైన తర్వాత ఇక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిన జయలలిత చనిపోయే వరకు అవివాహితగానే ఉండిపోయారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com