Home

»

Featured News

బాలయ్యతో భీష్మ: 17 ఏళ్ళ క్రితం ప్లాన్ చేసిన క్రేజీ మూవీ.. ఎందుకు ఆగిపోయింది.?

Nov 6, 2026 5:44PM

కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతాయి. అనౌన్స్ మెంట్ కూడా వస్తుంది. కానీ, సెట్స్ మీదకు వెళ్ళవు. 17 ఏళ్ళ క్రితం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రావాల్సిన ‘భీష్మ’ సినిమా పరిస్థితి అలాంటిదే.

‘ఒక ఊరిలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రమేష్ వర్మ.. 2009లో వచ్చిన ‘రైడ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాని, తనీష్, శ్వేతా బసు ప్రసాద్, అక్ష హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఒక బైక్ చుట్టూ కథను నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో రమేష్ వర్మకు వరుస అవకాశాలు రావడం మొదలైంది.

ఈ క్రమంలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్.. బాలకృష్ణతో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. 2009లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అప్పట్లో బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మీనరసింహ’ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఏర్పడింది.

అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రమేష్ వర్మ కూడా ‘భీష్మ’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇమేజ్‌ను రెట్టింపు చేసే సినిమా అవుతుందని, అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని చెప్పారు. దీంతో బాలయ్య అభిమానులు ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఎదురుచూశారు.

ఇది కూడా చదవండి: 175 డేస్ రికార్డు.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన టాప్10 సినిమాలు ఇవే.!

కానీ అనుకున్నట్లుగా ఈ సినిమా పట్టాలెక్కలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? అనే దానిపై చాలామందికి క్లారిటీ లేదు. అయితే స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందకపోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని ఒక సందర్భంలో బెల్లంకొండ చెప్పారు.

మొత్తానికి ‘రైడ్’తో మంచి బ్రేక్ అందుకున్న రమేష్ వర్మకు బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.

మీకు నచ్చవచ్చు:
అక్కినేని అరుదైన రికార్డు.. 1955లో 7 సినిమాలు, 6 సూప‌ర్‌హిట్‌.!
ఒకే సినిమాలో ముగ్గురు మెగాస్టార్లు.. ఆ సినిమా కోసం ద‌ర్శ‌కేంద్రుడు చేసిన సాహసం ఇదే!

 

 

[Balakrishna Bhishma Movie, Balakrishna Shelved Movie, Balakrishna Bheeshma Movie, Nandamuri Balakrishna, Director Ramesh Varma, Bheeshma Movie Telugu, Bhishma Movie 2009, Bellamkonda Suresh, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com