Home

»

Featured News

డబుల్ హ్యాట్రిక్ హీరో పవన్.. ఆ ఆరు చిత్రాలివే

Sep 1, 2023 5:57PM

పవర్ స్టార్ గా తెలుగునాట జేజేలు అందుకున్నారు పవన్ కళ్యాణ్. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న పాత్రలతో ముందుకు సాగిన పవన్.. తన నట ప్రస్థానంలో పలు విజయాలు చూశారు. మరీముఖ్యంగా.. ఒక దశలో ఆరు వరుస విజయాలతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు పవర్ స్టార్.

1997లో వచ్చిన గోకులంలో సీత, 1998లో రిలీజైన సుస్వాగతం, తొలిప్రేమతో హ్యాట్రిక్ హీరోగా నిలిచిన పవన్.. ఆపై 1999లో విడుదలైన తమ్ముడు, 2000లో వచ్చిన బద్రి, 2001లో రిలీజైన ఖుషితో మరో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. మొత్తంగా..  తన తరంలో ఆరు వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు పవన్. కాగా, వీటిలో తొలిప్రేమ, తమ్ముడు మినహా మిగిలిన సినిమాలన్నీ రీమేక్స్ కావడం విశేషం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com