Home

»

Featured News

నాగ్ బర్త్ డేకి రిలీజైన ఏకైక సినిమా.. ఏంటో తెలుసా!

Aug 29, 2023 2:55PM


కింగ్ నాగార్జున ఇప్పటివరకు 98 సినిమాల్లో సందడి చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఎంటర్టైన్ చేశారు. అలాగే కథానాయకుడిగానే కాకుండా.. అడపాదడపా అతిథి పాత్రల్లోనూ మెరిశారు. ఓవరాల్ గా.. 37 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే, నాగార్జున కెరీర్ మొత్తమ్మీద బర్త్ డే స్పెషల్ గా ఎన్ని సినిమాలు రిలీజయ్యాయో తెలుసా? కేవలం ఒకే ఒక చిత్రం. అది కూడా కెరీర్ ఆరంభంలో సందడి చేసిన మూవీ. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. 'కెప్టెన్ నాగార్జున్'. నాగ్ రెండో సినిమాగా జనం ముందుకొచ్చిన ఈ చిత్రం.. 1986 ఆగస్టు 29న రిలీజైంది. వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ కి జంటగా ఖుష్బూ నటించింది. మంచి అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ఇట్టే ఆకట్టుకోలేకపోయింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com