Home

»

Featured News

చిరంజీవి బర్త్ డే రోజు రిలీజైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా!

Aug 24, 2026 11:08AM

 


ఆగష్టు 22 ..ఈ డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే చెప్పని తెలుగు వాళ్ళు లేరు. అంతలా చిరంజీవి తన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల సొంత మనిషిగా మారారు. ఒకటి కాదు, రెండు కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి తనదైన మేనరిజమ్స్, డైలాగ్స్, ఫైట్స్   తో తెలుగు సినిమాపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉన్నారు. మరి అలాంటి చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో తన పుట్టినరోజు నాడు ఒకే ఒక్క మూవీని రిలీజ్ చేసారు. వినటానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న నిజం మాత్రం ఇదే.
 

   
‘చంటబ్బాయి’.. చిరంజీవిలో ఉన్నకామెడి కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం.    1986 ఆగస్టు 22న విడుదలైంది. సుహాసిని హీరోయిన్. లెజెండరీ కామెడీ దర్శకుడు జంధ్యాల మార్క్, చిరంజీవి ఎనర్జీ కలిసి చంటబ్బాయిని ఒక క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. చిరంజీవి ‘పాండురంగారావు’ అనే డిటెక్టివ్  క్యారక్టర్ లో చూపించిన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ అభిమానులని, ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచెత్తుతాయి. చిరంజీవి తనదైన మాస్ మేనరిజంని పక్కన పెట్టి  చాలా సింపుల్‌గా, ఫన్నీగా కనిపిస్తారు. ఇది ఆయన అభిమానులకి, ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని అందించింది. ‘చంటబ్బాయి’ కేవలం కామెడీ  మూవీ మాత్రమే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది.

చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ చంటబ్బాయి మాత్రం   బర్త్‌డే రోజు రిలీజైన ఏకైక సినిమాగా ఎప్పటికీ గుర్తుండిపోవడం ఖాయం.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com