Home

»

Featured News

మెగాస్టార్‌, క‌లెక్ష‌న్‌కింగ్ మ‌ధ్య హోరాహోరి పోరు.. గెలుపెవ‌రిదంటే?

Jun 16, 2026 2:51PM

సినిమా రంగంలో హీరోల మ‌ధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే అది ఆరోగ్య‌క‌ర‌మైన పోటీగానే ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఆయా హీరోల అభిమానులు దాన్ని ప్రెస్టీజియ‌స్‌గా తీసుకుంటారు. ఆ పోటీ ఎలా ఉన్నా.. ఫైన‌ల్‌గా ప్రేక్ష‌కులు ఇచ్చే తీర్పుపైనే ఆ సినిమాల భ‌విష్య‌త్తు ఆధారప‌డి ఉంటుంది. అలాంటి ఓ అరుదైన పోటీ మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య జ‌రిగింది.

1995 జూన్ 15న విడుద‌లైన ఈ ఇద్ద‌రు స్టార్స్ సినిమాలు పోటీ ప‌డ్డాయి. చిరంజీవి హీరోగా విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బిగ్‌బాస్‌, మోహ‌న్‌బాబు హీరోగా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెద‌రాయుడు ఒకేరోజు విడుద‌ల‌య్యాయి. ఈ రెండు సినిమాల‌పైన అప్పుడు భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే మోహ‌న్‌బాబు సినిమా పెద‌రాయుడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌గా, చిరంజీవి సినిమా బిగ్‌బాస్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు నిరాశ మిగిల్చి ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. 

అప్ప‌టి వ‌ర‌కు వరుస విజయాలతో దూసుకుపోతున్న చిరంజీవి బిగ్‌బాస్ అనే డిఫ‌రెంట్ టైటిల్‌తో చేస్తున్న సినిమా కావ‌డంతో ట్రేడ్ వర్గాల్లో నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో బిజినెస్ క్రేజ్ నడిచింది. దీనికి భిన్నంగా మోహన్ బాబు కొంత డల్ ఫేజ్‌లో ఉండటంతో ‘పెదరాయుడు’పై మొదట్లో సాధారణ అంచనాలే ఉన్నాయి.

తీరా కట్ చేస్తే, విడుదల రోజు థియేటర్ల వద్ద సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘పెదరాయుడు’ సినిమాలో మోహన్ బాబు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఎమోషన్స్, డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేయడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. దాంతో ఈ సినిమా అప్పట్లో అల్టిమేట్ కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది.

మరోవైపు చిరంజీవి ‘బిగ్ బాస్’ చిత్రం ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అప్పటికే ఈ కాంబినేషన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ వంటి ఇండస్ట్రీ హిట్ ఉండటంతో ఆ రేంజ్ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన మెగా అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. కథలో బలం లేకపోవడం, వీక్ స్క్రీన్‌ప్లే కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాల ఫలితాలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్‌కి గురిచేశాయి. మోహన్ బాబు కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా ‘పెదరాయుడు’ నిలిచిపోగా, చిరు కెరీర్‌లో ‘బిగ్ బాస్’ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ కంటే కంటెంట్ మాత్రమే ఎప్పుడూ సుప్రీమ్ అని నిరూపించిన రేర్ బాక్సాఫీస్ ఇన్సిడెంట్‌గా ఇది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com