Home

»

Featured News

అక్కినేని అరుదైన రికార్డు.. 1955లో 7 సినిమాలు, 6 సూప‌ర్‌హిట్‌.!

Sep 20, 2026 5:56PM

న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టుడిగా ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ముఖ్యంగా ఆయ‌న కెరీర్ ప్రారంభంలో చేసిన కొన్ని సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. త‌ను చేసే ప్ర‌తి సినిమా విభిన్నంగా వుండాల‌ని కోరుకునే అక్కినేని క‌థ‌లో వైవిధ్యం ఉండేలా చూసుకునేవారు.

అలా 1955లో ఎఎన్నార్ చేసిన 7 సినిమాల్లో 6 సినిమాలు సూప‌ర్‌హిట్‌గా నిలిచాయి. ఒకే ఏడాది ఆరు సినిమాలు సూప‌ర్‌హిట్ అవ్వ‌డం అనేది అప్ప‌ట్లోనే కాదు, ఇప్ప‌టికీ ఒక రికార్డుగానే చెప్పాలి.  


ఆ గోల్డెన్ ఇయర్‌లో విడుదలైన క్లాసిక్స్ జాబితా చూస్తే ఇప్పటి తరానికి కూడా ఆశ్చర్యం కలగక మానదు. ‘మిస్సమ్మ’, ‘అర్ధాంగి’, ‘రోజులు మారాయి’, ‘అనార్కలి’, ‘వదిన’, ‘దొంగరాముడు’ వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ అన్నీ కూడా ఆ ఒక్క ఏడాదిలోనే రావడం విశేషం.

ఈ చిత్రాల్లోని పాత్రల వైవిధ్యం అక్కినేని నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరించాయి. క‌మెడియ‌న్‌గా, ప్రేమికుడిగా, రైతుగా, అమాయకపు యువకుడిగా.. ఇలా ప్రతి పాత్రలో ఒదిగిపోయి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాశారు.

అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. నేటి తరం హీరోలకు ఒకే ఏడాది ఇన్ని విభిన్నమైన చిత్రాల‌తో స‌క్సెస్‌ సాధించడం ఒక కల అని కామెంట్లు పెడుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com