Home

»

Featured News

సూపర్ స్టార్ కృష్ణ 'అశ్వథ్థామ'కి 35 ఏళ్ళు!

Jul 27, 2023 1:19PM

 
 

సూపర్ స్టార్ కృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను రంజింపజేశాయి. వాటిలో 'అశ్వథ్థామ' సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో జగ్గయ్య, శారద, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్, రాజా, చలపతి రావు, ముచ్చర్ల అరుణ, వరలక్ష్మి, నర్రా వెంకటేశ్వరరావు, రాజేశ్, పి.జె. శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి కథ, మాటలు అందించారు.

కథ విషయానికి వస్తే.. అశ్వథ్థామ (కృష్ణ) ఓ డేరింగ్ బస్ డ్రైవర్. తనని స్మశానం సుబ్రహ్మణ్యం (నూతన్ ప్రసాద్) తప్పుడు కేసులో ఇరికిస్తాడు. అన్యాయానికి వ్యతిరేకంగా అశ్వథ్థామ చేసిన పోరాటంలో అడ్వకేట్ భార్గవి (శారద), కస్టమ్స్ ఆఫీసర్ సుధ (విజయశాంతి).. అతనికి ఏ విధంగా సహకరిస్తారు? అనేది మిగిలిన చిత్రం.

చక్రవర్తి బాణీలు కట్టిన 'అశ్వథ్థామ'కి వేటూరి సుందరరామ్మూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యమందించారు. "ఓ జాబిల్లి", "ఓరందగాడా", "అందాల బొమ్మ", "సిగ్గెట్టి కొట్టమాకు", "అశ్వథ్థామకు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ పిక్చర్ పతాకంపై యం. కృష్ణ, శేఖర్ నిర్మించిన 'అశ్వథ్థామ'.. 1988 జూలై 28న జనం ముందు నిలిచింది. శుక్రవారంతో ఈ జనరంజక చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com