Home

»

Bollywood News

"న‌న్ను పెళ్లాడ‌తావా?" అమీషాకు ప్ర‌పోజ్ చేసిన కాంగ్రెస్ లీడ‌ర్ త‌న‌యుడు!

Jan 03, 2022

 

బాలీవుడ్ బ్యూటీ అమీషా ప‌టేల్ ప్ర‌స్తుతం స‌న్నీ డియోల్ మూవీ 'గ‌ద‌ర్ 2' షూటింగ్‌తో బిజీగా ఉంది. 2001లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'గ‌ద‌ర్‌'కు ఇది సీక్వెల్‌. తాజాగా అమీషా సినిమాల‌కు సంబంధంలేని కార‌ణంతో లైమ్‌లైట్‌లో నిలిచింది. ఆమెకు ఒక దివంగ‌త కాంగ్రెస్ నాయ‌కుని కుమారుడు ప‌బ్లిగ్గా ప్ర‌పోజ్ చేశాడు. కొంత కాలంగా ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారంటూ వ‌దంతులు ఉన్నాయి. దివంగ‌త కాంగ్రెస్ నాయ‌కుడు అహ్మ‌ద్ ప‌టేల్ కుమారుడు ఫైస‌ల్ ప‌టేల్ ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

Also read: 'కేజీఎఫ్' లైఫ్‌టైమ్ క‌లెక్ష‌న్ల‌ను 13 రోజుల్లో దాటేసిన 'పుష్ప‌'!

అదే సంద‌ర్భంలో అత‌నితో క‌లిసున్న కొన్ని ఫొటోల‌ను షేర్ చేసిన అమీషా, అత‌నికి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది. “Happy Birthday my darling Faisal Patel, love you, have a good year," అని ఆమె ట్వీట్ చేసింది. అయితే దానికి ఫైస‌ల్ ఇచ్చిన రిప్లై ప‌లువురి నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించింది. “Thank you, Ameesha. I’m formally proposing in public. Will you marry me?” అని అత‌ను రాసుకొచ్చాడు. ఆ త‌ర్వాత ఏమైందో తెలీదు కానీ, ఆ పోస్టును అత‌ను డిలిట్ చేశాడు.

హృతిక్ రోష‌న్‌తో క‌లిసి న‌టించిన 'క‌హో నా ప్యార్ హై' మూవీతో ఓవ‌ర్‌నైట్ సెన్సేష‌న్‌గా మారింది అమీషా. ఆ ఇద్ద‌రికీ అది ఫ‌స్ట్ మూవీనే. స‌న్నీ డియోల్ స‌ర‌స‌న న‌టించిన 'గ‌ద‌ర్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌'తో ఆమె స్టార్‌డ‌మ్ పీక్స్‌కు చేరుకుంది. కానీ, ఆ త‌ర్వాత స‌బ్జెక్టుల ఎంపిక‌లో చేసిన పొర‌పాట్ల‌తో వ‌రుస‌గా ఫ్లాపులు చూసి, క్ర‌మేణా ఫేడ‌వుట్ అయిపోయింది. సోష‌ల్ మీడియాలో స్పైసీ ఫొటోలు, వీడియోల‌తో కాల‌క్షేపం చేస్తోంది. ఇప్పుడు చేస్తున్న 'గ‌ద‌ర్ 2' మూవీతో తిరిగి ఆడియెన్స్ మ‌న‌సులు దోచుకుంటాన‌నే న‌మ్మ‌కంతో ఉంది అమీషా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com