Home

»

Bollywood News

Ramayana: కలెక్షన్లు ఎక్కువ.. ఫుట్‌ఫాల్స్ తక్కువ.. అసలు లెక్కలేంటి.?

Nov 19, 2026 3:09PM

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రెండు వారాల్లోనే రూ.1500 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లతో పాటు ఫుట్‌ఫాల్స్‌ కూడా చర్చనీయాంశంగా మారాయి. భారీ వసూళ్లు సాధిస్తున్న ‘రామాయణ’కు థియేటర్లకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం గతంలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన సినిమాలతో పోలిస్తే తక్కువగా ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. 

ట్రేడ్ ట్రాకింగ్ లెక్కల ప్రకారం ‘రామాయణ’ సినిమాకు 14 రోజుల్లో భారత్‌లో 3.39 కోట్లకు పైగా ఫుట్‌ఫాల్స్ నమోదయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు రూ.1,500 కోట్లకు పైగా వచ్చాయి.

ఇండియాలో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన భారీ సినిమాల జాబితాను పరిశీలిస్తే.. ‘బాహుబలి 2’ సుమారు 10.6 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ‘పుష్ప 2’ 6.3 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ 5 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’ 4.8 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘ధురంధర్ 2’ సుమారు 4.3 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రెండు వారాల్లోనే 1500 కోట్లు.. ధురంధర్‌ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్‌.!

ఈ లెక్కలతో పోలిస్తే ‘రామాయణ’ వసూళ్లు భారీగా ఉన్నప్పటికీ, ఫుట్‌ఫాల్స్ మాత్రం ఇంకా ఆ సినిమాల స్థాయికి చేరలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

ఈ ప్రశ్నకు చిత్ర బృందం చెబుతున్న సమాధానం ఆసక్తికరంగా ఉంది. గతంలో భారీ ఫుట్‌ఫాల్స్ సాధించిన సినిమాలు ఎక్కువగా సాధారణ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, ‘రామాయణ’ మాత్రం 3D, IMAX వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ పెద్ద సంఖ్యలో విడుదలైందని చెబుతున్నారు. ఈ ఫార్మాట్లలో టికెట్ ధరలు సాధారణ షోలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉన్నా కలెక్షన్లు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. 

మొత్తానికి ‘రామాయణ’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ వసూళ్లతో కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా.. ఫుట్‌ఫాల్స్ విషయంలోనూ టాప్ చిత్రాల జాబితాలో ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!
క్యూట్ వీడియో.. గాయత్రీ మంత్రం చదివిన ప్రియాంక చోప్రా కూతురు.!

 

 

 

[Ramayana Box Office, Ramayana Footfalls, Ranbir Kapoor, Sai Pallavi, Yash]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com