Home

»

Bollywood News

Dhurandhar: ‘ధురంధర్’ను రిజెక్ట్ చేసిన స్టార్స్.. ముఖేష్ ఛాబ్రా సెన్సేషనల్ కామెంట్స్!

Mar 25, 2026

గతేడాది డిసెంబర్ లో విడుదలైన 'ధురంధర్'(Dhurandhar) మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో హీరోని మించి విలన్ పాత్రకి ఎక్కువ పేరొచ్చింది. ఇందులో విలన్ గా రెహమాన్ డెకాయిట్ అనే పాత్రలో అక్షయ్ ఖన్నా నటించాడు. సినిమా విడుదల సమయంలో ఆయన రోల్ కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.

అయితే 'ధురంధర్'లో రెహమాన్ డెకాయిట్ పాత్ర కోసం మొదట పలువురు ప్రముఖ నటులను సంప్రదించగా వారందరూ రిజెక్ట్ చేశారట. అక్షయ్ ఖన్నా కూడా మొదట్లో ఈ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రా రివీల్ చేయడం విశేషం.

ముఖేష్ ఛాబ్రా మాట్లాడుతూ, రెహమాన్ డెకాయిట్ పాత్ర చాలా తీవ్రమైన, డార్క్ షేడ్స్ ఉన్నది. ఇలాంటి నెగటివ్ రోల్స్ చేయడానికి చాలా మంది నటులు ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందో లేదనే అనుమానం కూడా వారిలో ఉండేదని తెలిపారు. సినిమాలో మిగతా పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండటంతో రెహమాన్ డెకాయిట్ పాత్ర హైలైట్ కాదని వారు భావించినట్లు చెప్పారు.

ఈ పాత్రను చాలా మంది నటులు తిరస్కరించడంతో పాటు, చివరికి ఈ పాత్రను పోషించిన అక్షయ్ ఖన్నా కూడా మొదట ఒప్పుకోలేదని ముఖేష్ ఛాబ్రా తెలిపారు. కథ వినకముందే ఆయన “ఇలాంటి పాత్ర ఎందుకు?” అని సందేహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ చెప్పిన కథ విని, వెంటనే ఈ పాత్రకు అక్షయ్ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. 

సినిమా విడుదలైన తర్వాత రెహమాన్ డెకాయిట్ పాత్రకు ఊహించని రెస్పాన్స్ రావడంతో, ఆ పాత్రను రిజెక్ట్ చేసిన యాక్టర్స్ అంతా ఫీల్ అయ్యారని ముఖేష్ ఛాబ్రా చెప్పుకొచ్చారు.

సరైన కథ, సరైన నటుడు ఉంటే నెగటివ్ రోల్ కూడా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపుతుందో 'రెహమాన్ డెకాయిట్' రోల్ ను ఉదాహరణగా చెప్పవచ్చు.

కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ గా తెరకెక్కిన 'ధురంధర్: ది రివెంజ్'(Dhurandhar 2) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఫుల్ రన్ లో రూ.1500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశముంది. రూ.2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com