అతని కళ్లలోకి చూస్తే లవ్‌లో పడిపోతానేమోనని, షూలేస్‌ల వంక చూస్తూ నటించాను!
on Nov 19, 2021

నటి రాణీ ముఖర్జీ 90వ దశకం, 2000 ఆరంభంలో బాలీవుడ్‌ను ఏలిన తారల్లో ఒకరు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'బంటీ ఔర్ బబ్లీ 2' ప్రమోషన్స్ నిమిత్తం సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'కపిల్ శర్మాస్ కామెడీ షో'లో పాల్గొన్న ఆమె బాలీవుడ్‌లో తన తొలినాటి అనుభవాలను పంచుకుంది. "ఎప్పుడైనా ఏ యాక్టర్‌తోనైనా నటించేటప్పుడు నెర్వస్‌గా ఫీలయ్యారా?" అనే ప్రశ్న కపిల్ శర్మ నుంచి ఎదురైనప్పుడు 'గులామ్'లో ఆమిర్ ఖాన్‌తో, 'కుచ్ కుచ్ హోతా హై'లో షారుక్ ఖాన్‌తో నటించేటప్పుడు నెర్వస్‌నెస్ ఫీలయ్యానని చెప్పింది రాణి.
"అప్పట్లో నాకు 16-17 ఏళ్లుంటాయి. అంతకు ముందే నేను బిగ్ స్క్రీన్‌పై ఆమిర్, షారుక్‌లను చూశాను. 'ఖయామత్ సే ఖయామత్ తక్' మూవీలో ఆమిర్‌ను చూసినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. అలాగే 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే'లో షారుక్‌ను చూసి ఇష్టపడ్డాను. 'గులామ్' మూవీలో ఆమిర్‌తో ఒక రొమాంటిక్ సీన్ చేసే అవకాశం వచ్చినప్పుడు అతని కళ్లలోకి చూస్తే ఎక్కడ ప్రేమలో పడిపోతానేమోనని భయపడి, తన షూలేస్‌ల వంక చూస్తూ వుండిపోయాను." అని వెల్లడించింది.
రాణి వెల్లడించిన విషయాలకు కపిల్ శర్మ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత రాణి స్క్రీన్‌పై ఎలా రొమాన్స్ చేయాలో తనకు ఆమిర్ నేర్పించాడనీ, ఎంత బాగా నేర్పించాడంటే ఇవాళ తాను ఒక చెట్టుతో కూడా రొమాన్స్ చేయగలననీ చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



