సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ, హీరో నథింగ్.. విలనే హీరో అయ్యాడు!
on Feb 2, 2026
ఏ కమర్షియల్ సినిమాలోనైనా ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. వారిద్దరి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్ ప్రధానంగా సినిమా నడుస్తుంది. సినిమా మొదట్లో విలన్ ఎన్ని ఎత్తులు వేసినా, హీరోని ఎంత ఇబ్బంది పెట్టినా ఫైనల్‌గా హీరో చేతుల్లో తన్నులు తినడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఫార్ములా మన సినిమాల్లో కనిపిస్తోంది.
ఒకప్ప్పుడు సినిమాలో హీరోకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. హీరో తర్వాతే ఎవరైనా అన్నట్టుగా సినిమాలు ఉండేవి. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ కథల్లో, హీరోల క్యారెక్టరైజేషన్‌లో, విలన్ క్యారెక్టరైజేషన్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక విధంగా విలన్‌కి ప్రాధాన్యం పెరిగింది. అతని పాత్రను పవర్‌ఫుల్‌గా చూపిస్తేనే హీరో మరింత ఎలివేట్ అవుతాడనే భావం మన డైరెక్టర్లలో బలంగా కనిపిస్తోంది. అలా చేసిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి కూడా.
గత డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ చిత్రం... పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరో. ఒక రస్టిక్ లుక్‌లో సీక్రెట్ ఏజెంట్ పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అతని కంటే విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నాకే పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు గమనార్హం. ఇప్ప్పుడిది చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ స్క్రీన్ ప్రజెన్స్, విలనిజం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో అక్షయ్ ఖన్నానే హైలైట్ చేస్తున్నారు.
‘దురంధర్’ చిత్రానికి వస్తున్న ఈ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ఒక సినిమా హిట్ అయినా, బ్లాక్‌బస్టర్ అయినా హీరో ఒక్కడినే హైలైట్ చెయ్యడం లేదని, సినిమాలో హీరోతోపాటు ఇతర పాత్రల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని అర్థమవుతోంది. అవసరమైతే ఆ పాత్రలు పోషించిన వారిని హైలైట్ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒకప్ప్పుడు హీరోలు ఆ పాత్రలకే పరిమితమయ్యేవారు. విలన్‌గా నటిస్తే తమ ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందనే భయం వారిలో ఉండేది. అందుకే విలన్‌గా చేసే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసేవారు.
ఇప్ప్పుడు ట్రెండ్ మారింది. విలన్‌గా చేసినంత మాత్రాన ఒరిగే నష్టం ఏమీ లేదని గ్రహిస్తున్నారు హీరోలు. అందుకే ఇతర భాషల్లో విలన్‌గా నటించే అవకాశం వస్తే సంతోషంగా ఒప్ప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో విలన్స్‌గా నటిస్తున్న హీరోల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కథ, అందులోని తమ క్యారెక్టర్ నచ్చితే అది విలన్ క్యారెక్టర్ అయినా, నెగెటివ్ షేడ్స్ ఉన్నా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఓటీటీలు, పాన్ ఇండియా మూవీస్ బాగా పెరిగిపోవడంతో ఇమేజ్ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు హీరోలు. స్టార్ ఇమేజ్ వల్లే సినిమాలు సక్సెస్ అవుతాయనే మాటకు ఇప్ప్పుడు కాలం చెల్లింది. కంటెంట్, క్యారెక్టరైజేషన్, ఏ పాత్ర తీరు ఎలా ఉంది, ఆ పాత్రల్లో నటీనటులు ఎలా పెర్‌ఫార్మ్ చేస్తున్నారు అనేదే ప్రధానంగా ప్రేక్షకులు చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఇమేజ్ లేని హీరో చేసినా ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



