Home

»

Bollywood News

మంగ‌ళ‌వారం క‌లెక్ష‌న్ రూ. 18 కోట్లు.. 'ద క‌శ్మీర్ ఫైల్స్' ప్ర‌భంజ‌నం

Mar 16, 2022

 

వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేయ‌గా గ‌త శుక్ర‌వారం విడుద‌లైన 'ద క‌శ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతోంది. రోజు రోజుకూ ఆ సినిమా క‌లెక్ష‌న్లు పెరుగుతూ, విశ్లేష‌కుల్ని సైతం విస్మ‌యానికి గురిచేస్తున్నాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ. 27.15 కోట్లు (నెట్‌) వ‌సూలు చేసిన ఆ సినిమా సోమ‌వారం నాలుగో రోజు 15.05 కోట్ల‌ను రాబ‌ట్టింది. ఇప్పుడు మంగ‌ళ‌వారం 'ద క‌శ్మీర్ ఫైల్స్' కు వ‌చ్చిన క‌లెక్ష‌న్లు చూసి, ఆ సినిమా ప్ర‌భంజ‌నం ఏ రేంజ్‌లో ఉందో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. Also read: 'రుద్ర' సిరీస్ రివ్యూ.. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను ఆడుకున్న రాశీ ఖ‌న్నా!

ట్రేడ్ రిపోర్టుల ప్ర‌కారం విడుద‌లైన ఐదో రోజు 'ద క‌శ్మీర్ ఫైల్స్' రూ. 18 కోట్ల‌ను సాధించింది. దీంతో విడుద‌లైన తొలి మంగ‌ళ‌వారం క‌లెక్ష‌న్ల‌లో ప‌లు భారీ సినిమాలను సైతం అది అధిగ‌మించింది. ఇదే రోజు అక్ష‌య్‌కుమార్ 'ఎయిర్‌లిఫ్ట్' రూ. 17.8 కోట్లు, షాహిద్ క‌పూర్ 'క‌బీర్ సింగ్' రూ. 16.53 కోట్లు, అక్ష‌య్ కుమార్ 'గుడ్ న్యూస్' రూ. 16.20 కోట్లు, అజ‌య్ దేవ్‌గ‌ణ్ 'తానాజీ' రూ. 15.28 కోట్లు, దీపికా ప‌డుకోనే ప‌ద్మావ‌త్ రూ. 14 కోట్లు వ‌సూలు చేశాయి. సూప‌ర్‌స్టార్లు లేని ఓ సినిమా విడుద‌లైన 5 రోజుల‌కే రూ. 60.20 కోట్లు (నెట్‌) సాధించ‌డం ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. Also read: బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బ‌బ్లీ బౌన్సర్'గా మారిన త‌మ‌న్నా

ప్ర‌స్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కునే కాకుండా రూ. 150 కోట్ల మార్కును కూడా అందుకుంటుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. 1990ల‌లో క‌శ్మీర్‌లో హిందువుల‌పై ఇస్లాం ఛాంద‌స‌వాదులు జ‌రిపిన మార‌ణ‌కాండ‌, అత్యాచారాలు, దౌర్జ‌న్యాల నేప‌థ్యంలో న‌డిచే ఈ సినిమాలో అనుప‌మ్ ఖేర్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, ద‌ర్శ‌న్ కుమార్‌, ప‌ల్ల‌వీ జోషి కీల‌క పాత్ర‌లు చేశారు. జీ స్టూడియోస్‌తో క‌లిసి తెలుగు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ ఈ మూవీని నిర్మించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com