Home

»

Bollywood News

స్త్రీ 2  కి  నాలుగు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్.. నవ్వితే మాకు సంబంధం లేదు 

Aug 19, 2024 12:25PM

ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ ల మోత మోగిస్తున్న మూవీ  స్త్రీ 2 (stree 2) రాజ్ కుమార్ రావు(rajkummar rao)శ్రద్ద కపూర్(shraddha kapoor)జంటగా రాగా  మూవీలో పెద్ద పెద్ద సెట్టింగ్ లు లేవు, పెద్ద పెద్ద ఛేజింగ్ లు లేవు. పైగా భారీ బడ్జట్ కూడా కాదు. కానీ ఇప్పుడు రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది.

వరల్డ్ వైడ్ గా  థియేటర్స్ లోకి   అగస్ట్ 15 న  స్త్రీ 2  అడుగుపెట్టింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని రాబట్టింది. అన్ని ఏరియల్లోను ఇదే పరిస్థితి. అందుకు ఫలితంగా నాలుగు రోజులకు గాను 283 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇండియా వ్యాప్తంగా 240 కోట్లు, ఓవర్ సీస్ 43 కోట్ల గ్రాస్ ని సాధించి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తుంది. అంతే కాకుండా పలు  సినిమాల రికార్డులని కూడా బీట్ చేస్తున్న నయా మూవీగా కూడా నిలిచింది.రీసెంట్ గా వచ్చిన  కల్కి మొదటి నాలుగు రోజుల బాలీవుడ్ కలెక్షన్స్ కి కూడా దాటింది. దీంతో  రాబోయే రోజుల్లో  మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

పక్కా హర్రర్ అండ్ కామెడీ గా తెరకెక్కిన స్త్రీ 2 లో ఆ రెండు అంశాలు కూడా  ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.తమన్నా భాటియా ఒక ప్రత్యేక గీతంలో నటించగా స్టార్ హీరో  అక్షయ్ కుమార్ ఒక ప్రత్యేక పాత్రలో కనపడి ప్రేక్షకులని నవ్వుల్తో  ముంచెత్తాడు. అలాగే మరో స్టార్ హీరో  వరుణ్ ధావన్ క్యామియో రోల్ లో కూడా కనపడటం   స్త్రీ 2 స్పెషాలిటీ. పంకజ్ త్రిపాఠి, ఆపర్ శక్తి ఖురానా తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిశారు.అమర్ కౌశిక్ దర్శకుడు(amar kaushik)కాగా 50 కోట్ల బడ్జట్ తో దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే లు నిర్మించారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com