Home

»

Bollywood News

Madhuri dixit: మహిళా క్యారక్టర్లపై మాధురీ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు 

Jun 6, 2026 5:33PM

 

మాధురీ దీక్షిత్ అనే పేరుకి ఉన్న వైబ్రేషన్స్ యొక్క వయసుకి నాలుగున్నర దశాబ్దాల హిస్టరీ ఉంది.ఆమె సరికొత్తగా నటించిన చిత్రం ‘మా బెహెన్’ జూన్ 4, 2026 న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డార్క్ కామెడీ క్రైమ్ డ్రామాలో మాధురీ దీక్షిత్ ‘రేఖ’ అనే ధైర్యవంతురాలైన ఒంటరి తల్లి క్యారక్టర్ ని పోషించింది.  25 ఏళ్ల చిన్న వయసులోనే భర్తని కోల్పోయి, సమాజం పెట్టే కష్టాలను ఎదుర్కొంటూ ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచిన మహిళ కథ ఇది. సదరు క్యారక్టర్  జీవనం కోసం నైటీలు అమ్మడం, టిఫిన్ సర్వీస్ నడపడం, సైబర్ కేఫ్ పెట్టడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, సమాజం ఆమె కష్టాన్ని గుర్తించకుండా కేవలం ఆమె వేసుకునే దుస్తుల గురించి, స్లీవ్‌లెస్ బ్లౌజుల గురించే ఎక్కువగా మాట్లాడుతు  నిందలు వేస్తుంటారు.

మా బెహెన్ సక్సెస్  సందర్భంగా ఆమె మాట్లాడుతు  ప్రేమ, బంధాల విషయంలో పురుషులని ఒకలా, స్త్రీలని మరోలా చూసే వివక్ష సమాజంలో ఇంకా బలంగా నాటుకుపోయింది. పురుషుల శృంగార ఎంపికలని  సమాజం గొప్పగా చూస్తుందని, అదే సమయంలో మహిళలు అలాంటి ఎంపికలు చేసుకుంటే తప్పుగా చిత్రీకరిస్తుంది. ఇది పూర్తిగా పితృస్వామ్య సమాజం. కాలం మారుతున్నా మొదటి నుంచి ఉన్న ఆ పాత ఆలోచనలే కొనసాగుతున్నాయి. పురుషుడికి ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే అతడిని ‘క్యాసనోవా’ అని పిలుస్తూ గొప్పగా చూస్తారు. అదే మహిళకి ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే ఆమెని  ఎంతో నెగెటివ్‌గా చూస్తూ రకరకాల పేర్లతో దూషిస్తారని చెప్పుకొచ్చింది. 


Also read: Vijay Sethupathi: విజయ్ సేతుపతి సంచలనం.. మూడు లాంగ్వేజెస్ లో సొంతంగా అంటే మాటలా!


ఈ సినిమాలో కథ మొత్తం రేఖ ఇరుగుపొరుగున ఉండే గుప్తాజీ అనే వ్యక్తి శవం ఆమె వంటగదిలో అనుమానాస్పదంగా పడి ఉండటంతో ప్రారంభమవుతుంది. ఆ నింద తనపై పడకుండా ఉండేందుకు రేఖ తన ఇద్దరు కుమార్తెలైన జయ, సుష్మలతో కలిసి ఆ శవాన్ని దాచడానికి చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేస్తాయి. ఈ చిత్రంలో జయ క్యారక్టర్ లో త్రిప్తి డిమ్రి, సుష్మ గా  డిజిటల్ క్రియేటర్ ధారణా దుర్గా నటించారు. సురేష్ త్రివేణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సమాజంలోని పితృస్వామ్య పోకడలను, మహిళలను నిరంతరం పర్యవేక్షించే ‘సోషల్ సర్వైలెన్స్’ వ్యవస్థను ఎండగట్టింది. మహిళలు తమకు నచ్చినట్లు బతకాలని చూస్తే ఈ సమాజం వారికి ‘మ్యాన్ ఈటర్’, ‘విచ్’ (మంత్రగత్తె) వంటి దారుణమైన లేబుల్స్ ఇస్తుందని చూపిస్తుంది. ఈ సినిమాలో ఒక సందర్భంలో తన దుస్తులపై సమాజం చేసే కామెంట్లకు సమాధానంగా, "ఇది ఎంతటి దారుణమైన విషయం? నా బ్లౌజ్ ముక్కకి, నా క్యారెక్టర్‌కు సంబంధం ఏంటి?" అని రేఖ అడిగే డైలాగ్ నేటి సమాజపు ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నిస్తోంది.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com