Home

»

Bollywood News

సౌత్‌పై కన్ను: క్రేజీ డైరెక్టర్లతో షారుఖ్ ఖాన్ బిగ్ ప్రాజెక్టులు.!

Sep 12, 2026 4:15PM

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే సౌత్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మన సౌత్ కథలు, మన దర్శకుల మేకింగ్ శైలే ఇండియన్ సినిమాను ఏలుతోంది. ఈ విషయాన్ని మన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా గట్టిగా నమ్ముతున్నారు.

'పఠాన్', 'జవాన్' లాంటి వరుస బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారుఖ్, అసలు ఏమాత్రం తొందరపడకుండా తన నెక్స్ట్ లైనప్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'కింగ్' సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన లైనప్ మొత్తం సౌత్ డైరెక్టర్లతోనే నిండిపోనుందనే వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హల్చల్ చేస్తున్నాయి.

షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన 'జవాన్' సినిమా రూ. 1100 కోట్లకు పైగా గ్రాస్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'రాకా' సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, షారుఖ్ - అట్లీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. అంతేకాకుండా ఇదొక ప్యూర్ తమిళ చిత్రం కాబోతోందని కూడా కోలీవుడ్‌లో గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే.. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ ఒక భారీ సినిమా చేసే అవకాశముందట. టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. సుకుమార్ మేకింగ్ స్టైల్, ఆయన క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ మాస్ కథలో షారుఖ్ ఖాన్ నటిస్తే.. బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మారడం ఖాయం. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఏదీ అఫీషియల్‌గా ఖరారు కాలేదు.

ఇది మాత్రమే కాదు. 'KGF', 'సలార్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేసిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా షారుఖ్ ఖాన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది.

ప్రస్తుతానికి అట్లీ సినిమా మాత్రమే కన్ఫర్మ్ అంటున్నప్పటికీ.. సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటి విజనరీ డైరెక్టర్లతో షారుఖ్ ఖాన్ సంప్రదింపులు జరపడం చూస్తుంటే.. ఆయన తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ సౌత్ ఫిల్మ్‌మేకర్ల చేతిలోనే పెట్టబోతున్నారని స్పష్టమవుతోంది.

 

 

 

[Shah Rukh Khan, SRK Next Movies, South Directors, Director Atlee, Director Sukumar, Prashanth Neel, Mythri Movie Makers, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com