Home

»

Bollywood News

Sara Ali Khan: ప్రేమలో మునిగితేలుతున్న సారా అలీ ఖాన్!

Apr 26, 2026 2:49PM

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ (Sara Ali Khan) తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె నటిస్తున్న 'పతి పత్నీ ఔర్‌ వో దో' (Pati Patni Aur Woh Do) మూవీ నుంచి ఒక అందమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని రెండో సాంగ్ 'దిల్ వాలే చోర్' (Dil Wale Chor)ను చిత్ర బృందం విడుదల చేసింది.

"నువ్వు కనిపిస్తే.. స్వర్గం ఎదురైనా అటు వైపు నా చూపు మరలదు" అంటూ తన ప్రియుడిపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తపరిచే మెలోడీగా ఈ పాట సాగుతుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ తన ప్రియుడితో జరిపే ప్రేమ కబుర్లు, ఆమె హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. "ప్రేమ బంధం, మనసు చోరీ.. రెండూ కలిసే" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటను షేర్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సారా అలీ ఖాన్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

సమకాలీన ప్రేమకథలు, వైవాహిక జీవితంలోని చిక్కుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఆయుష్మాన్ ఖురానా మార్క్ కామెడీతో పాటు, భావోద్వేగమైన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సారా, రకుల్ వంటి క్రేజీ భామలు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉండబోతోంది.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సారా అలీ ఖాన్, 'పతి పత్నీ ఔర్‌ వో దో'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ చిత్రంలోని పాటలకు లభిస్తున్న స్పందన చూస్తుంటే, సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com