Home

»

Bollywood News

Alone VS Lonely.. కండల వీరుడు సల్మాన్ షేర్ చేసిన తాత్విక పోస్ట్ వైరల్!

May 18, 2026

బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో ట్రెండింగ్‌గా మారుతుంది. భాయ్‌జాన్ తన పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ యాభై ఏళ్ల పైబడిన ముదురు బెండకాయ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన ఒక అదిరిపోయే లుక్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఈ లేటెస్ట్ పిక్‌లో సల్మాన్ ఖాన్ డిమ్ లైటింగ్ ఉన్న గదిలో, సోఫాపై షర్ట్‌లెస్ లుక్‌లో పడుకుని కనిపించారు. ఈ వయసులో కూడా ఆయన మెయింటైన్ చేస్తున్న పర్ఫెక్ట్ ఫిజిక్ నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అయితే కేవలం ఫోటో మాత్రమే కాదు, దానికి సల్మాన్ జోడించిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ క్యాప్షన్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒంటరితనం గురించి సల్మాన్ రాస్తూ.. "జీవితంలో ఒంటరిగా ఉండటానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి 'అలోన్' (Alone), మరొకటి లోన్లీ' (Lonely). మనకు నచ్చినట్టు ఒంటరిగా గడపడం అలోన్ అయితే, మనతో ఉండటానికి ఎవరూ ఇష్టపడనప్పుడు వచ్చే బాధ లోన్లీనెస్. మరి దీని తర్వాత ఏం చేయాలో మీరే డిసైడ్ అవ్వండి" అంటూ ఒక తాత్వికమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటో తెలియక ఫ్యాన్స్ తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా 2005లో సల్మాన్‌తో కలిసి 'లక్కీ' సినిమాలో నటించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పెట్టిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. "ఓరి దేవుడా ఆది.. మన సినిమా టైమ్‌లో ఇవన్నీ ఎందుకు చేయలేదు?" అంటూ సల్మాన్ క్యారెక్టర్ పేరుతో ఆమె సరదాగా ఆటపట్టించింది. అలాగే సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ ఇలియా వంతూర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా వంటి వారు ఫైర్ ఎమోజీలతో ఈ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపించారు.

సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు కథల స్క్రిప్టులు పూర్తిగా చదవడం అస్సలు అలవాటు లేదని, కేవలం లైన్ మాత్రమే వింటానని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక రీసెంట్‌గా ‘రాజా శివాజీ’ మూవీలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన భాయ్‌జాన్, త్వరలోనే ‘మాతృభూమి’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సల్మాన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com