Home

»

Bollywood News

సైఫ్‌పై పదిసార్లు కత్తితో దాడి.. ఆ రాత్రి రోడ్డుపై కరీనా ఏం చేశారో తెలుసా?

Nov 5, 2026 6:11PM

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై 2025 జనవరిలో జరిగిన కత్తి దాడి అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబైలోని తన నివాసంలోకి చొరబడిన ఓ దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో తన భర్తను కాపాడుకోవడానికి కరీనా కపూర్ ఎంతగా ఆందోళన చెందారో తాజాగా మరోసారి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక అనుభవాలను సైఫ్, కరీనా గుర్తు చేసుకున్నారు.

కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ జంట పాల్గొన్న సందర్భంగా సైఫ్‌పై జరిగిన దాడి గురించి మాట్లాడారు. దాడి జరిగిన సమయంలో సైఫ్ తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కరీనా నైట్ డ్రెస్‌లోనే రోడ్డుపైకి పరుగెత్తారట. ఆటో కోసం రోడ్డుపై ‘రుకో.. రుకో’ అంటూ గట్టిగా అరుస్తూ తిరిగానని కరీనా వెల్లడించారు. ఆ సమయంలో తాను దుస్తులు మార్చుకునే సమయం కూడా లేదని, అదృష్టవశాత్తూ ఎవరూ ఆ దృశ్యాలను వీడియో తీయలేదని చెప్పారు.

లిఫ్ట్‌లో రక్తంతో తడిసిపోయిన సైఫ్‌ను చూసినప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కాలేదని కరీనా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ‘సైఫ్.. అలా చేయకు’ అంటూ ఆందోళన చెందానని చెప్పారు. అంతేకాదు.. తండ్రి పరిస్థితిని చూసిన పెద్ద కుమారుడు తైమూర్ అడిగిన ప్రశ్న తనను మరింత కలచివేసిందని తెలిపారు. ‘అబ్బా.. మీరు చనిపోతారా?’ అని తైమూర్ అడిగాడట. ఆ చిన్నారి మాటలు విన్నప్పుడు తమ కుటుంబం ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కొందో అర్థమవుతుందని కరీనా చెప్పుకొచ్చారు.

మరోవైపు సైఫ్ కూడా ఆ రాత్రి జరిగిన దాడి గురించి వివరించారు. తన కుమారుడు జెహ్ దగ్గర కత్తితో నిలబడి ఉన్న దుండగుడిని చూసి తట్టుకోలేక ఎదురుదాడికి దిగానని, ఆ సమయంలో దుండగుడు తనపై సుమారు పదిసార్లు కత్తితో దాడి చేశాడని చెప్పారు. ఈ దాడిలో మెడపై లోతైన గాయాలవడంతో పాటు, విరిగిపోయిన కత్తి ముక్క తన వీపులోనే ఉండిపోయిందని తెలిపారు. ఆ తర్వాత తనను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.

ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ’ విధ్వంసం: ఫస్ట్ డే కళ్లు చెదిరే కలెక్షన్స్

కత్తి ముక్క వెన్నెముకకు చాలా దగ్గరగా ఉండటంతో పరిస్థితి ప్రాణాపాయంగా మారిందని సైఫ్ వెల్లడించారు. మరో మిల్లీమీటర్ లోతుగా గాయం అయి ఉంటే ప్రాణాలు కోల్పోయేవాడినని వైద్యులు చెప్పినట్లు కరీనా గుర్తు చేసుకున్నారు. కత్తి ముక్కను బయటకు తీయడానికి వైద్యులు నరాలను పక్కకు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత దాదాపు ఆరు నెలల పాటు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయానని కరీనా చెప్పారు. సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రశాంతంగా కనిపించడంతో ఈ దాడి నిజమేనా? అంటూ సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలపైనా ఈ జంట స్పందించింది.

ఇక ఈ ఘటన తర్వాత చిన్న కుమారుడు జెహ్ తన తండ్రికి ప్లాస్టిక్ కత్తిని ఇచ్చి, ‘తర్వాత ఆ దొంగ వస్తే దీనితో కొట్టండి’ అని చెప్పాడట. ఆ సంఘటన మొత్తం తన కళ్ల ముందే జరగడంతో, ఇప్పుడు తాను గొప్ప రక్షకుడినని జెహ్ భావిస్తున్నాడని సైఫ్ నవ్వుతూ చెప్పారు. సర్జరీ తర్వాత తండ్రిని చూసిన పెద్ద కుమారుడు ఇబ్రహీం కన్నీళ్లు పెట్టుకున్నాడని కూడా గుర్తు చేసుకున్నారు. మొత్తానికి సైఫ్‌పై జరిగిన ఆ దాడి నుంచి ఆయన కోలుకున్నప్పటికీ.. ఆ రాత్రి తమ కుటుంబానికి మిగిల్చిన భయం, ఆందోళన మాత్రం అంత త్వరగా మరిచిపోలేనివని ఈ జంట మాటలను బట్టి అర్థమవుతోంది.

మీకు నచ్చవచ్చు: బాలయ్య ‘దాదాా’ వాయిదా : క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

 

 

[Saif Ali Khan Knife Attack, Kareena Kapoor, Saif Ali Khan Health, Taimur Ali Khan, Jeh Ali Khan, Koffee With Karan, Saif Kareena Interview, Bollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com