Home

»

Bollywood News

స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇంట విషాదం.. బాలీవుడ్ ప్ర‌ముఖుల సంతాపం.! 

Sep 22, 2026 4:55PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసున్న కృష్ణ ముఖర్జీ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ విషాద వార్తతో రాణి ముఖర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కృష్ణ ముఖర్జీ మృతిని రాణి ముఖర్జీ కుటుంబం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అభిమానులు, సన్నిహితులు అందిస్తున్న ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నందున గోప్యతను గౌరవించాలని కోరారు. అయితే కృష్ణ ముఖర్జీ మరణానికి గల కారణాన్ని మాత్రం కుటుంబం వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: నారా రోహిత్ తనయుడి పేరు ఇదే.. తాతయ్య గుర్తుగా ా పేరును చేర్చిన హీరో

రాణి ముఖర్జీకి ఆమె తల్లితో ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. సినీ కెరీర్ విషయంలో కూడా కృష్ణ ముఖర్జీ తన కుమార్తెకు ఎంతో ప్రోత్సాహం అందించారు. రాణి నటిగా కెరీర్ ప్రారంభించే విషయంలో ఆమె తల్లి కీలక పాత్ర పోషించారు. నటన వైపు వెళ్లాలని రాణిని ప్రోత్సహించడమే కాకుండా, ఆమె తొలి సినిమా ‘రాజా కీ ఆయేగీ బరాత్’ సమయంలో కూడా కృష్ణ ముఖర్జీ ఆసక్తికరంగా స్పందించినట్లు గతంలో రాణి వెల్లడించారు.

కృష్ణ ముఖర్జీకి కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. బెంగాలీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా పనిచేశారు. 1982లో వచ్చిన ‘తీస్రీ ఆంఖ్’ చిత్రంలోని ‘ఇద్ కే దిన్ గలే మిల్ లే రాజా’ పాటకు ఆమె గాత్రం అందించారు.

ఇదిలా ఉంటే.. రాణి ముఖర్జీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘గులామ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘సాథియా’, ‘హమ్ తుమ్’, ‘బ్లాక్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల ‘మర్దానీ 3’లోనూ కనిపించారు.

తల్లి మరణంతో రాణి ముఖర్జీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణ ముఖర్జీ మృతికి బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

మీకు నచ్చుతుంది: స్టార్ హీరోల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న నిధి అగర్వాల్

ఏందయ్య సామీ.. రణబాలి ఫుల్ సాంగ్‌లో విజయ్, రష్మిక కెమిస్ట్రీ హైలైట్

 

[Rani Mukerji, Rani Mukerji Mother, Krishna Mukerji, Krishna Mukerji Death, Rani Mukerji Mother Dies, Rani Mukerji Family, Bollywood News, Rani Mukerji Latest News, Rani Mukerji Mother Death, Krishna Mukerji Age, Hindi Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com