
ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ విజువల్ వండర్, మన పురాణ కావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ఎపిక్ ప్రాజెక్ట్ 'రామాయణ' గురించి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇండియాలో ఒక తేదీన, అలాగే ఓవర్సీస్‌లో మరో తేదీన.. ఇలా రెండు వేర్వేరు తేదీల్లో థియేటర్లలోకి రాబోతోంది.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌ని డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ వండర్‌ని గ్లోబల్ వైడ్‌గా ప్రెజెంట్ చేయడానికి సోనీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర సంస్థలు రంగాంలోకి దిగాయి.
తాజాగా బయటకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం.. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా 2026 నవంబర్ 6న ప్రీమియర్ కాబోతోంది. కానీ ఇండియాలో మాత్రం రెండు రోజుల వ్యవధితో అంటే నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది.
సాధారణంగా ఇండియన్ సినిమాలకు ఇండియాలోనే ముందుగా లేదా సేమ్ డేట్ రిలీజ్ ప్లాన్ చేస్తారు. కానీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తున్న సోనీ పిక్చర్స్.. అంతర్జాతీయ మార్కెట్‌కు ఉన్న ఫ్రైడే రిలీజ్ కల్చర్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 6 శుక్రవారం రోజే ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. అదే సమయంలో ఇండియాలో దీపావళి పండుగ హడావుడి నవంబర్ 8న ప్రారంభమవుతుండటంతో, మన దేశంలో దీపావళి కానుకగా నవంబర్ 8 ఆదివారం నాడు విడుదల చేయాలని నిర్మాత నమిత్ మల్హోత్రా అండ్ టీమ్ ప్లాన్ చేశారు.
ఓవర్సీస్‌లో రెండు రోజుల ముందే 'రామాయణ' విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉండబోతోంది, ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు రోజుల గ్యాప్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash





