Home

»

Bollywood News

IMDBలో ‘ది ఒడిస్సీ’ని క్రాస్ చేసిన ‘రామాయ‌ణ‌’.. 13 రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే.?

Nov 18, 2026 11:37AM

నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. నవంబర్ 5న విడుదలైన ఈ సినిమా కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,483.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం త్వరలోనే రూ.1,500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా దూసుకుపోతోంది.

నవంబర్ 17న 13వ రోజు ఈ సినిమా భారతదేశంలో రూ.28.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అంతకుముందు 12వ రోజు వచ్చిన రూ.32 కోట్లతో పోలిస్తే వసూళ్లు 10.3 శాతం తగ్గాయి. దీంతో ఇప్పటివరకు దేశీయంగా మొత్తం రూ.821.30 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.981.50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.

ఇక ఓవర్సీస్ మార్కెట్లలో రూ.502 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం వసూళ్లలో విదేశీ మార్కెట్ల వాటా సుమారు 33.8 శాతంగా ఉండటం విశేషం. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

దేశీయ బాక్సాఫీస్ వద్ద హిందీ వెర్షన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. 13వ రోజు ఒక్క హిందీలోనే రూ.21 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. మలయాళంలో రూ.2.35 కోట్లు, కన్నడలో రూ.2.10 కోట్లు, తమిళంలో రూ.1.75 కోట్లు, తెలుగులో రూ.1.50 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: ‘పుష్ప’ని మించిన సీన్.. పోలీసులతో 3 చెరువుల నీళ్లు తాగించిన స్మగ్లర్.!

తొలి వారంలోనే (8 రోజుల్లో) భారత్‌లో రూ.564.60 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా.. రెండో వారంలో పని దినాల్లో కాస్త నెమ్మదించినా, విదేశీ మార్కెట్లలో మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. అన్ని భాషల్లోనూ వస్తున్న వసూళ్లతో రామాయణ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

మరోవైపు ఐఎండీబీ పాపులారిటీ చార్ట్‌లోనూ 'రామాయణ' మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ క్రమంలో 'ది ఒడిస్సీ' సినిమాను కూడా అధిగమించినట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణతో ఈ సినిమా మరో అరుదైన రికార్డును అందుకునే దిశగా సాగుతోంది. మరి రూ.1,500 కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు: 

ప్రేమను పదాల్లో కాదు.. భావాల్లో చూపించిన పాట.. ‘మెల్లగా కరగనీ..’ వెనుక ఇంత అర్థం ఉందా?

ప‌నిమ‌నిషి చేతిలో ఓడిపోకూడ‌ద‌ని ఏం చేసిందో చూడండి.!

 

 

 

[RamayanaMovie, RanbirKapoor, SaiPallavi, Yash, Nitesh Tiwari]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com