Home

»

Bollywood News

Ramayana: బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ.. ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డు.!

Nov 10, 2026 11:19AM

బాక్సాఫీస్ దగ్గర ‘రామాయణ’ జోరు మామూలుగా లేదు. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా.. ఐదో రోజు మాత్రం ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు సాధించింది. దీపావళి పండగ తర్వాత వచ్చిన సోమవారం కూడా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడి కొనసాగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

‘రామాయణ’ ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.126 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని, దీపావళి తర్వాత వచ్చిన రోజుల్లోనూ ఇదే అతిపెద్ద కలెక్షన్ అని వెల్లడించింది. సాధారణంగా పండగ సెలవులు ముగిసిన తర్వాత సినిమాల వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ ‘రామాయణ’ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

ట్రేడ్ లెక్కల ప్రకారం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.660 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇండియాలోనూ రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు బాక్సాఫీస్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ భారీ వసూళ్లతో దూసుకెళ్తుండగా.. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఐదో రోజు వసూళ్లలోనూ హిందీ వెర్షన్ ప్రధాన వాటా అందించగా.. దక్షిణాది భాషల నుంచి కూడా గణనీయమైన వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన ‘వారణాసి’.. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని డీల్.!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు. రవి దూబే లక్ష్మణుడి పాత్రలో కనిపించగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, భారీ వసూళ్లతో ‘రామాయణ’ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. మొదటి ఐదు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. అలా అంటారనే ఆరోజు మౌనంగా ఉన్నా.!

 

 

 

[Ramayana Day 5 Record 126 Crore, Ramayana Day 5 Collection, Ramayana Creates History, Ramayana Movie Records, Ramayana Box Office, Ramayana Collections, Ranbir Kapoor, Yash, Sai Pallavi, Nitesh Tiwari]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com