
రణబీర్ కపూర్(Ranbir Kapoor),సాయిపల్లవి(sai Pallavi)యష్(Yash)నితీష్ తివారి, నమిత్ మల్హోత్రా ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ రామాయణ. ఈ మూవీలో రాముడి సోదరుడు భరతుడిగా కనిపించబోతున్నాడు ఆదినాథ్ కొఠారే. మరాఠీ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు. పదిహేనేళ్ల క్రితం మరాఠీ చిత్ర పరిశ్రమకే చెందిన హీరోయిన్ ఊర్మిళా కానేత్కర్ ని వివాహం చేసుకున్నాడు.
గత కొన్ని నెలలుగా కొఠారే, ఊర్మిళా మధ్య విభేదాలు ఉన్నాయని, విడిగా ఉంటున్నారని,త్వరలోనే విడాకులు తీసుకుంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పడు ఆ ఉహాగానాలని నిజం చేస్తూ ఈ రోజు విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా ఇద్దరు ప్రకటన చెయ్యడం గమనార్హం..
ఈ స్టార్ జంట ప్రయాణం 2006లో 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమా సెట్స్ పై ప్రారంభమైంది. ఆదినాథ్ తండ్రి మహేష్ కొఠారే దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే ఊర్మిళ కథానాయికగా రంగ ప్రవేశం చేశారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఐదేళ్ల సుదీర్ఘ డేటింగ్ తర్వాత డిసెంబర్ 2011లో ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత, అంటే 2018 లో వీరికి జిజా అనే కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో గత ఏడాది కాలంగా మనస్పర్థలు తలెత్తాయి. 2025 చివరి నాటికే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అప్పట్లో ఈ జంట స్పందించలేదు.
Also read: క్రికెట్ వర్సెస్ సినిమా.. గెలిచేది ఎవరు!
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్న ఎమోషనల్ నోట్‌లో ఆ ఇద్దరు ఉమ్మడిగా స్పందిస్తు 'భాగస్వాములుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, తమ ముద్దుల కుమార్తె జిజా భవిష్యత్తు, సంక్షేమం తమకి అత్యంత ప్రాధాన్యత మని, ఆమె ప్రేమపూర్వకమైన, సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా ఇద్దరం కలిసి కో పేరెంటింగ్ బాధ్యతలని నిర్వర్తిస్తాం. గత 15 ఏళ్లుగా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అలాగే ఉంటుంది. ఈ కష్టసమయంలో మీడియా, అభిమానులు తమ వ్యక్తిగత జీవితానికి (ప్రైవసీకి) భంగం కలిగించకుండా గౌరవించాలని వేడుకున్నారు.
ramayana,addinath kothare, Urmila Kanetkar





