Home

»

Bollywood News

హీరోయిన్ కి ముద్దు పెట్టబోయిన అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ గ్యారంటీ 

Jul 16, 2026 3:33PM

 


అభిమాని లేనిదే హీరో లేడు, హీరోయిన్ లేదు.  కానీ అంత మాత్రాన అభిమాని తన హద్దులు మర్చిపోకూడదు కదా!. కానీ ఒక అభిమాని తన హద్దులు మర్చిపోయి బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే పై అనుచితంగా ప్రవర్తించాడు.    


 రీసెంట్ గా పూనమ్ పాండే ముంబైలోని ఒక బహిరంగ ప్రదేశంలో మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ల ముందు చిరునవ్వుతో పోజులు ఇస్తున్న సమయంలో, ఒక  అభిమాని పూనమ్ వద్దకి వచ్చి  సెల్ఫీ అడిగాడు.దీంతో పూనమ్ పాండే కెమెరా వైపు చూస్తుండగా  అతను  చాలా దగ్గరగా వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఊహించని పరిణామంతో పూనమ్ పాండే ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆమె, ఆ వ్యక్తిని గట్టిగా పక్కకి తోసివేసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు వెంటనే జోక్యం చేసుకుని పూనమ్ పాండేను ఆ వ్యక్తి నుండి దూరంగా తీసుకెళ్లారు. ఈ మొత్తం ఉదంతాన్ని  రికార్డ్ చేయడంతో, నిమిషం నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read: ఈ సారి 500 కోట్లు.. నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ 

అయితే, ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. పూనమ్ పాండే గత చరిత్రని  గుర్తుచేసుకుంటూ కొంత మంది నెటిజెన్స్ స్పందిస్తూ 'ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ లేదా స్క్రిప్టెడ్ డ్రామా కావచ్చు  కొద్దిరోజుల క్రితమే నేను గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు పూనమ్  ఒక నకిలీ ప్రకటన చేసి, ఆ తర్వాత ఒక రోజులోనే ప్రత్యక్షమై అది కేవలం అవగాహన కోసమే చేసిన ప్రచారమని చెప్పిన విషయాన్నీ గుర్తుకుతెస్తున్నారు.

Poonam pandey, mumbai

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com