Home

»

Bollywood News

బాడీ షేమింగ్: కత్రినా కైఫ్‌పై దారుణమైన ట్రోల్స్.. ఇదేం సంస్కృతి.?

Sep 16, 2026 6:10PM

భారతీయ సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. కేవలం నటనలోనే కాదు, 'కే బ్యూటీ' అనే బిజినెస్ బ్రాండ్‌తో ఏకంగా ₹350 కోట్ల టర్నోవర్ సాధించి యంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్లకు ఆదర్శంగా నిలిచారు. కానీ, ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో ఆమె తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కనిపించగానే నెటిజన్లు దేనిపై ఫోకస్ చేశారో తెలుసా? ఆమె సాధించిన విజయాల మీద కాదు, ఆమె బిజినెస్ సామ్రాజ్యం మీద కాదు.. ప్రసవానంతరం ఆమె శరీరంలో వచ్చిన సహజమైన మార్పుల మీద.

కత్రినా కైఫ్ ప్రసవం తర్వాత బరువు పెరిగారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణమైన బాడీ షేమింగ్ కామెంట్లతో దాడి చేయడం మొదలుపెట్టారు. "ఆమె కేరింగ్ మరిచిపోయింది", "ఆమె కెరీర్ ముగిసిపోయింది" అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ బాడీ షేమింగ్ ట్రోల్స్ పై కత్రినా అభిమానులతో పాటు, ప్రముఖ రచయిత్రి సాక్షి నరులా వంటి వారు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. "ప్రసవానంతరం ఏ మహిళ శరీరంలోనైనా మార్పులు రావడం సహజం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్‌నెస్ ట్రైనర్లు, న్యూట్రిషనిస్టులు అందుబాటులో ఉన్న కత్రినా కైఫ్‌కి తన శరీరాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలీదా?" అని ప్రశ్నించారు. కానీ కత్రినా ప్రస్తుతం తన మాతృత్వాన్ని, తన చిన్నారి ఆనందాన్ని ఆస్వాదిస్తూ దానికి ప్రాధాన్యత ఇస్తోంది.

ఒక మహిళ విజయవంతమైన వ్యాపారవేత్త అయినా, నటి అయినా, లేదా ఒక సాధారణ గృహిణి అయినా.. ఆమె సాధించిన కష్టాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి, కేవలం శరీరం బరువు ఆధారంగా ఆమె అర్హతను కొలవడం ఏ రకమైన సంస్కృతి? సైజ్ జీరో ఉంటేనే సక్సెస్ ఉన్నట్లా? బరువు పెరిగితే కెరీర్ అయిపోయినట్లేనా? అంటూ కత్రినా కైఫ్ ను ట్రోల్ చేస్తున్న వారిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

[Katrina Kaif Body Shaming, Katrina Kaif Trolls, Katrina Kaif Postpartum Weight, Katrina Kaif Weight, Katrina Kaif, Vicky Kaushal, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com