కత్రినా-విక్కీ వెడ్డింగ్ వెన్యూ, డేట్ వెల్లడయ్యాయ్!
on Oct 28, 2021
బాలీవుడ్ యాక్టర్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ రిలేషన్షిప్ గురించి బయటకు పెదవి విప్పనప్పటికీ, ఆ ఇద్దరూ పరస్పరం ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ తమ అనుబంధాన్ని మరో లెవల్‌కు తీసుకువెళ్లడానికి ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ఇద్దరి నుంచి ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా, ఆ జంట ఇప్పటికే తమ పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్నారనీ, వారి పెళ్లి దుస్తులను సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారనీ నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. లేటెస్ట్గా మరో రిపోర్ట్, వారి వెడ్డింగ్ వెన్యూతో పాటు వెడ్డింగ్ డేట్‌ను కూడా వెల్లడించింది.
ఆ రిపోర్ట్ ప్రకారం, రాజస్థాన్‌లో డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కత్రినా, విక్కీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సవాయ్ మధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా అనే రిస్టార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. రాజస్థాన్‌లోని రంథంబోర్ నేషనల్ పార్క్ నుంచి 30 నిమిషాల దూరంలో ఈ రిసార్ట్ ఉంది.
ఓ వైపు పెళ్లి ప్రచారం జరుగుతుండగా, ఈ నెల 26న ఆ జంట సెలబ్రిటీ మేనేజర్ రేష్మా శెట్టి ఆఫీసులో పాపరాజ్జి కంటపడ్డారు. డిసెంబర్లో వారి పెళ్లి జరగనున్నదనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మొదలైన రోజే వారు జంటగా కెమెరా కళ్లకు దొరికిపోయారు. పైగా ఫొటోగ్రాఫర్లను చూసి నవ్వు ముఖాలు పెట్టారు కూడా.
కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షోలో ఆ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ చూశాక.. కత్రినా, విక్కీ డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ వ్యాపించాయి. విక్కీతో పనిచెయ్యాలని కత్రినా కోరుకుంటోందనీ, ఆ ఇద్దరూ చూడచక్కగా ఉంటారనీ ఆ షోలో కరణ్ జోహార్ అన్నప్పుడు, విక్కీ మూర్ఛపోయినట్లు నటించాడు.
తాము ప్రేమలో ఉన్నట్లు వారు ఎన్నడూ అంగీకరించకపోయినప్పటికీ, 'జూమ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ కపూర్ (అనిల్ కపూర్ కొడుకు) "విక్కీ, కత్రినా కలిసున్నారనేది వాస్తవం. ఈ విషయం చెప్పి నేను ఇబ్బందుల్లో పడుతున్నానా అనేది నాకు తెలీదు. ఈ విషయంలో వారు చాలా ఓపెన్‌గా ఉన్నారని అనుకుంటున్నాను" అని చెప్పాడు.
Also Read