కంగనా రనౌత్ బ్యాడ్ ఫేజ్.. తొమ్మిది సినిమాల్లో 8 ఫ్లాప్స్!
on May 25, 2022
ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కెరీర్ ప్రస్తుతం ఏమాత్రం బాగా లేదు. ఆమె నటించిన చివరి 9 సినిమాల్లో ఏకంగా 8 ఫ్లాపయ్యాయి. లేటెస్ట్గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన 'ధాకడ్' సినిమా అయితే మరీ ఘోరంగా ఫెయిలయ్యింది. మూడు రోజుల్లో ఆ సినిమాకు దేశవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ కేవలం రూ. 1.55 కోట్లు అంటే.. ఏ రేంజ్లో డిజాస్టర్ అయ్యిందో ఊహించుకోవచ్చు. విడుదలైన తొలిరోజే ఈ సినిమాకు రూ. 50 లక్షలు రావడం చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోయారు. ట్రేడ్ వర్గాలు సైతం షాకయ్యాయి.
2014, 2015 సంవత్సరాలలో ఆమె నుంచి 'క్వీన్', 'తను వెడ్స్ మను రిటర్న్స్' అనే రెండు బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చాయి. ఆ తర్వాత నుంచీ ఆమెకు బ్యాడ్ ఫేజ్ మొదలైంది. ఒక్క 'మణికర్ణిక' (2019) మినహా ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేదా డిజాస్టర్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ 'తలైవి' కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఆ సినిమా రాంగ్ టైమ్‌లో రిలీజైంది. మహారాష్ట్రలో థియేటర్లు మూతపడి ఉన్న టైమ్‌లో ఆ మూవీ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ ధాకడ్ ఘోరంగా ఆడుతుండటం ట్రేడ్ వర్గాలను కలవరానికి గురిచేస్తోంది.
'తను వెడ్స్ మను రిటర్న్స్' తర్వాత ఆమె నటించిన ఐ లవ్ న్యూ ఇయర్, కట్టి బట్టి, రంగూన్, సిమ్రన్, జడ్జిమెంటల్ హై క్యా, పంగా, ఇప్పుడు 'ధాకడ్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డాయి.
ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా మాట్లాడుతూ, "ఇది ఆమె వరస్ట్ ఫ్లాప్. కలెక్షన్ల పరంగా, ఇటీవలి కాలంలోని వరస్ట్ ఫిలిమ్స్‌లో ఇదొకటి. వీకెండ్లో ఒక రోజు రూ. 50 లక్షలే వచ్చాయి. ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ నటించిన సినిమాకి లక్షల్లో ఓపెనింగ్స్ రావడమేంటి? ఆఖరుకి బి-కేటగిరీ సినిమాలు కూడా ఇంతకంటే బాగా వసూలు చేశాయి. కంగన కెరీర్లోనే ఇది చెత్త సినిమా" అని చెప్పాడు.
Also Read