Home

»

Bollywood News

Kangana Ranaut: కేంద్ర మంత్రితో ప్రేమాయణం.. అతనితో ఎప్పుడో పిల్లలు.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్!

Apr 17, 2026 4:18PM

బాలీవుడ్ క్వీన్, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమా రాజకీయాల కంటే ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌(Chirag Paswan)తో ఆమె క్లోజ్‌గా ఉండటం, పార్లమెంట్ ఆవరణలో వీరిద్దరూ నవ్వుతూ కనిపించడం చూసి, వీరు ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై కంగనా తనదైన శైలిలో స్పందించి అందరికీ షాక్ ఇచ్చారు.

చిరాగ్ నా ప్రాణస్నేహితుడు మాత్రమే!
తమ మధ్య ఉన్న బంధం గురించి వస్తున్న వార్తలను కంగనా కొట్టిపారేశారు. "చిరాగ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన నాకు మిత్రుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు" అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ రూమర్లను తుడిచిపెట్టేలా ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. “ఒకవేళ మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే, ఈ పాటికి మాకు పెళ్లై పిల్లలు కూడా ఉండేవారు” అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

సినిమా నుంచి పార్లమెంట్ వరకు..
వీరిద్దరి పరిచయం నిన్న మొన్నటిది కాదు. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ (Miley Naa Miley Hum) అనే సినిమాతో చిరాగ్ పాశ్వాన్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో కంగనానే హీరోయిన్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ ఎదురుపడినప్పుడు చిరాగ్ కంగనాను ఆప్యాయంగా పలకరించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ రూమర్లు మళ్ళీ మొదలయ్యాయి.

కంగనా చేసిన ఈ తాజా కామెంట్స్ తో సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. స్నేహాన్ని ప్రేమని కలిపి చూడొద్దని ఆమె చెప్పకనే చెప్పారు. ఏది ఏమైనా, ఈ ఇద్దరు సెలబ్రిటీల స్నేహం మాత్రం నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com