
భారతీయ సినిమా గర్వపడే నటుడు అమీర్ ఖాన్( Aamir Khan).. బాలనటుడిగా ఐదు దశాబ్దాల క్రితం సినీ రంగ ప్రవేశం చేసి స్టిల్ ఇప్పటికి కోట్లాదిమంది అభిమానులని తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో అలరిస్తూ వస్తున్నాడు. సినిమా సైతం గర్వపడే పెర్ఫార్మ్ కూడా అమీర్ సొంతం. అమీర్ సినీ జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అమీర్ ఖాన్ తన స్నేహితురాలు గౌరి స్ప్రాట్ ని మూడో వివాహం చేసుకోబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి, ఆమిర్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్ కాజోల్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
అమీర్ నుంచి వచ్చిన లగాన్ మూవీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో కాజోల్(kajol)మాట్లాడుతు 'ఆమిర్ కి సినిమాల ఎంపికలోనే కాదు, మహిళల ఎంపికలోను మంచి టేస్ట్ ఉంది. ఆయన జీవితంలోకి వచ్చే మూడో వ్యక్తి కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైనవారే అయి ఉంటారని చెప్పుకొచ్చింది. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అమీర్ రెండవ భార్య కిరణ్ రావు స్టేజ్ పైనే ఉండటంతో కాజోల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also read: VIjay: మీకేమైనా అర్ధమవుతుందా.. రిలీజ్ ఎప్పుడు మహాప్రభు!
అమీర్, కాజోల్ కాంబినేషన్ లో వచ్చిన 'ఫనా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2006లో విడుదలైన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దాదాపు ఆ రోజుల్లోనే 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అమీర్, కాజోల్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. తెరపైనే కాకుండా నిజజీవితంలోనూ వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అమీర్ తన మొదటి భార్య రీనా దత్తాతో 16 ఏళ్ల బంధం తర్వాత 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుని పెళ్లాడాడు. అయితే, 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021లో కిరణ్ రావుతో విడిపోయాడు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న 59 ఏళ్ల అమీర్ , ఇప్పుడు గౌరి స్ప్రాట్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జులై 5 ఆ ఇద్దరి పెళ్లి ఉండవచ్చని టాక్.




