Home

»

Bollywood News

Janhvi Kapoor: జాన్వీ కపూర్ సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

Jul 3, 2026 12:21PM

బాలీవుడ్ లెజెండ్రీ నటి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, కేవలం వెండితెరపైనే కాదు.. డిజిటల్ ప్రపంచంలోనూ తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తోంది. గ్లామర్, నటనతో పాటు సోషల్ మీడియాను ఎలా కమర్షియల్‌గా వాడుకోవాలో ఈ యంగ్ బ్యూటీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న 2.67 కోట్లకు పైగా ఫాలోయింగ్‌ను, ఎక్స్ వేదికగా ఉన్న క్రేజ్‌ను ఈ భామ క్యాష్ చేసుకుంటున్న తీరు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు జాన్వీతో ప్రమోషన్స్ చేయించేందుకు క్యూ కడుతుండటంతో ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ అగ్రశ్రేణి కార్పొరేట్ కంపెనీల డిజిటల్ షోరూమ్‌లుగా మారిపోయాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్ పోస్ట్ చేసే ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ వెనుక భారీ వ్యాపార సామ్రాజ్యం దాగి ఉంది. ట్రేడ్ వర్గాల నమ్మకమైన సమాచారం ప్రకారం.. ఈ బ్యూటీ తన ఇన్స్టా ఖాతాలో పెట్టే ఒకే ఒక్క యాడ్ పోస్ట్ లేదా రీల్ కోసం సుమారు 7 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తోంది. అలాగే ఎక్స్ వేదికగా చేసే ఒక్కో పోస్టుకు కూడా లక్షల్లోనే డిమాండ్ చేస్తోంది. కేవలం విడివిడి పోస్టుల రూపంలోనే కాకుండా.. ఒప్పో, లెన్స్‌కార్ట్, తుమి, హావెల్స్ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లకు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బల్క్ ప్యాకేజీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ విధమైన లాంగ్ టర్మ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె ఏడాదికి 1 కోటి నుండి 2.5 కోట్ల రూపాయల వరకు భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం.

నెలవారీ ఆదాయ లెక్కలు చూస్తే జాన్వీ కపూర్ డిజిటల్ సంపాదన ఊహకందని స్థాయిలో సాగుతోంది. ఒకే నెలలో కనీసం డజనుకు పైగా విభిన్న బ్రాండ్స్, అంటే లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్, గ్యాడ్జెట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి ప్రకటనలను ఆమె నిరంతరాయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ రకంగా లెక్కిస్తే కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే ఈ క్రేజీ బ్యూటీ నెలవారీ ఆదాయం 1.5 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్లో ఇంతటి కమర్షియల్ వాల్యూ, తిరుగులేని క్రేజ్ ఉన్న మరో స్టార్ హీరోయిన్ బాలీవుడ్‌లో లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కేవలం డిజిటల్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా.. సినిమాల పరంగానూ జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకుతోంది. హిందీ చిత్రసీమలో ఈ భామ నటిస్తున్న ఒక్కో సినిమాకు బడ్జెట్, ప్రొడక్షన్ హౌస్‌ను బట్టి సుమారు 5 కోట్ల నుండి 6 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్‌కు సమన్యాయం చేస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. మరోవైపు సౌత్ ఇండియాలోనూ జాన్వీ ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించిన గ్లోబల్ హిట్ దేవర చిత్రానికి గానూ ఆమె దాదాపు 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వ‌చ్చిన క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది కోసం కూడా ఆమె దాదాపు 4 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని వసూలు చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా ప్రచారం సాగుతోంది. ఇలా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ జాన్వీ కపూర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

 

 

 

Janhvi Kapoor, Janhvi Kapoor Instagram Earnings, Janhvi Kapoor Brand Endorsements, Janhvi Kapoor Remuneration, Janhvi Kapoor Devara, Janhvi Kapoor Monthly Income

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com