అరెస్ట్ కానున్న జాక్వలిన్?
on Dec 6, 2021
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌కు ముద్దులు పెడుతున్న ఫొటో వైరల్ కావడంతో హెడ్‌లైన్స్‌లో నిలిచింది బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్. ఇప్పుడామె సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆమె అరెస్టయ్యే అవకాశం ఉంది. ఒక ఫ్యాన్సీ వాష్‌రూమ్ లోపల సుఖేశ్ బుగ్గపై జాక్వలిన్ ముద్దు పెడుతున్న ఫొటో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని పలు రిపోర్టులు పేర్కొన్నాయి.
అయితే, సుఖేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో లబ్ధి పొందిన వారిలో తను కూడా ఉందనే ఆరోపణలతో జాక్వలిన్‌కు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఆదివారం సాయంత్రం దుబాయ్‌కు వెళ్లడానికి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
Also read: ఆర్థిక నేరగాడు సుఖేశ్ బుగ్గపై జాక్వలిన్ ముద్దు.. బయటకొచ్చిన మిర్రర్ సెల్ఫీ!
ఒక రిపోర్ట్ ప్రకారం, సుఖేశ్‌తో పాటు జాక్వలిన్, మరో బాలీవుడ్ తార నోరా ఫతేహిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7 వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ ఇద్దరు తారలు సుఖేశ్ నుంచి ఖరీదైన కానుకలు అందుకున్నారని ఆ చార్జిషీట్లో ఆరోపించారు.
Also read: ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో రిలేషన్షిప్లో జాక్వలిన్? ఫొటో వైరల్!
ఇంటరాగేషన్ సందర్భంగా, జాక్వలిన్‌కు రూ. 10 కోట్ల విలువైన కానుకలు, నోరా ఫతేహికి ఒక విలాసవంతమైన కారును ఇచ్చినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ వెల్లడించాడు. జాక్వలిన్‌కు ఇచ్చిన కానుకల్లో రూ. 52 లక్షల విలువైన ఒక గుర్రం, ఒక్కొక్కటి రూ. 9 లక్షల విలువైన నాలుగు పర్షియన్ పిల్లులు ఉన్నాయి.
Also read: సిక్కులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ పై కేసు నమోదు!
జాక్వలిన్‌ను ఈ కేసు నుంచి తప్పించడంలో ఆమె సన్నిహితుడు, గురువు అయిన సల్మాన్ ఖాన్ ఎలాంటి సహాయం చేయలేకపోవచ్చుననీ, అతి త్వరలోనే ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయవచ్చనీ వినిపిస్తోంది. ఆమె స్నేహితులందరూ ఈ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయకుండా మౌనం వహిస్తున్నారు.
Also Read