
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. "హైవాన్" సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "హైవాన్" మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మూవీలోని ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ ను టీజర్ లో పరిచయం చేశారు. సైఫ్ అలీఖాన్ ని దివ్యాంగుడి పాత్రలో చూపించడం ఆసక్తి రేపుతోంది. అక్షయ్ కుమార్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు. భవనం పై నుంచి నోట్ల కట్టలు కిందికి పడటం, ఒకరు గాయాలతో సహాయం కోసం వేచి చూస్తుండటం టీజర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ ప్రియదర్శన్ తన మార్క్ థ్రిల్లర్ మూవీని హైవాన్ లో ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు టీజర్ ప్రామిస్ చేస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన "హైవాన్" ఫస్ట్ లక్ పోస్టర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు టీజర్ కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకునేలా కనిపిస్తోంది.
'హైవాన్' మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు.
Haiwaan Teaser, Akshay Kumar, Saif Ali Khan, Priyadarshan, KVN Productions




