Home

»

Bollywood News

ఓటీటీలోకి 'గంగూబాయి'.. ఎప్పుడంటే?

Apr 20, 2022 11:21AM

ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. ఫిబ్రవరి 25 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఆలియా నటనకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.

'గంగూబాయి కతియావాడి' ఈ నెల 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉండనుంది. 'ఆర్ఆర్ఆర్'తో ఆలియా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నిడివి తక్కువ అయినప్పటికీ సీత పాత్రలో తనదైన శైలిలో నటించి మెప్పించింది. దీంతో 'గంగూబాయి'పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవల ఆలియా హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఆలియా చేతిలో 'బ్రహ్మాస్త్ర', 'డార్లింగ్స్' వంటి సినిమాలు ఉన్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com