Home

»

Bollywood News

షారుఖ్ సినిమా సెట్‌లో రచ్చ.. డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి తల పగలగొట్టిన స్టార్ హీరోయిన్‌!

May 14, 2026 7:24PM

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రస్తుతం గ్లోబల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెళ్లై బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన క్రేజ్‌ను ఇంచు కూడా తగ్గించుకోకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ భామ, ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ (Raka) చిత్రంలోనూ మెరవనుంది. అయితే తాజాగా దీపికాకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ వైరల్ వీడియోలో దీపికా పదుకొణె ఏకంగా స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తల పగలగొట్టడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. బాటిల్‌తో ఆమె కొట్టిన దెబ్బకు రోహిత్ శెట్టి తల నుంచి రక్తం కారుతుండటం చూసి నెటిజన్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. "దీపికాకు ఇంత కోపమా? షూటింగ్ సెట్‌లో ఇంతలా ప్రవర్తించిందా?" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇది నిజమైన గొడవ కాదు, కేవలం ఫన్ కోసం చేసిన ఒక చిన్న ప్రాంక్ మాత్రమే. బ్లాక్ బస్టర్ హిట్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. సరదాగా సాగుతున్న సమయంలో దీపికా తన చేతిలోని బాటిల్‌తో రోహిత్ తలపై కొట్టింది. అయితే అది నిజమైన గాజు బాటిల్ కాదు, సినిమాల్లో ఉపయోగించే ‘షుగర్ గ్లాస్’ బాటిల్. అది తగిలినా ఎటువంటి గాయాలు అవ్వవు.

ఈ బ్లూపర్ వీడియో చూసిన అభిమానులు దీపికా నటనకు, రోహిత్ శెట్టి టైమింగ్‌కు ఫిదా అవుతున్నారు. 2013లో విడుదలైన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అప్పట్లో రికార్డులు సృష్టించింది. షారుఖ్ ఖాన్, దీపికా కాంబోలో వచ్చిన ఈ మూవీ సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌తో మాస్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం దీపికా చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు బాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్, మరోవైపు సౌత్ ఇండియన్ బిగ్ బడ్జెట్ సినిమాలతో ఈమె దూసుకుపోతోంది. అల్లు అర్జున్ సినిమాతో పాటు మరిన్ని సౌత్ ప్రాజెక్టులకు ఈమె సంతకం చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడంతో దీపికా అభిమానులు ఆమె పాత సినిమాల జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com