
షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ఈ 19 న 'కాక్‌టెయిల్ 2 'తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కగా అభిమానులు, ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటుంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం మొదటి వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. ముఖ్యంగా యువత, అర్బన్ ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టడంతో వసూళ్లు ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి.
రిలీజ్ రోజైన శుక్రవారం నాడు ఇండియా వ్యాప్తంగా 13.50 కోట్ల నెట్ వసూళ్లతో డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా 20.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. శనివారం నాడు అంటే రెండో రోజు 16.25 కోట్ల నెట్ (19.50 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆదివారం నాడు సెలవు దినం కావడంతో వసూళ్లు మరింత పెరిగాయి. మూడో రోజున ఈ చిత్రం ఏకంగా 17.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు నిరూపించుకుంది.
Also read: Prema: ఆ స్టార్ హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన ప్రేమ
మొత్తంగా చూస్తే, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే (ఓపెనింగ్ వీకెండ్) ఇండియా వైడ్ గా 47.50 కోట్ల నెట్, గ్రాస్ వసూళ్లు 57 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి ప్రదర్శన కనబరిచింది. మూడు రోజుల్లో 19.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనితో 'కాక్‌టెయిల్ 2' చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 76.25 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లని సాధించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిచింది. ఈ కలెక్షన్ల జోరుతో హీరో షాహిద్ కపూర్ తన గత చిత్రం 'దేవా' (2025) లైఫ్‌టైమ్ నెట్ వసూళ్లను (రూ. 34.37 కోట్లు) కేవలం మూడు రోజుల్లోనే దాటేశారు. అంతేకాదు, 2012లో వచ్చిన ఒరిజినల్ క్లాసిక్ 'కాక్‌టెయిల్' మొదటి రెండు రోజుల వసూళ్లని ( 23.18 కోట్లు) కూడా ఈ సీక్వెల్ అధిగమించింది.





