ఇండస్ట్రీని షేక్ చేసిన సల్మాన్-ఐశ్వర్య కాంట్రవర్షియల్ లవ్ స్టోరీ!
on Jun 23, 2021
బాలీవుడ్లో ఒకప్పుడు సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ మధ్య బంధం ఇండస్ట్రీని షేక్ చేసింది. వారి మధ్య బంధాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెర్రిబుల్ రిలేషన్షిప్స్లో ఒకటిగా విశ్లేషకులు పరిగణిస్తుంటారు. 1999లో ఆ ఇద్దరూ జంటగా 'హమ్ దిల్ దే చుకే సనమ్'లో నటించారు. అప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ బంధం ఏర్పడింది. ఒకర్ని విడిచి ఒకరు విడిచి ఉండలేనంత ప్రేమమైకంగా ఆ ఇద్దరూ మునిగిపోయారు.
అయితే ఒకరోజు ఉన్నట్లుండి సల్మాన్ తనను శారీరకంగా వేధించాడంటూ ఐశ్వర్య ఆరోపించడం సంచలనం సృష్టించింది. 2001లో ఐశ్వర్య అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సల్మాన్ తలుపులు అదేపనిగా బాదుతూ ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఐశ్వర్యపై ఒత్తిడి తెచ్చాడు సల్మాన్. కానీ అతడి విపరీత ధోరణికి విసిగిపోయిన ఐశ్వర్య అందుకు అంగీకరించలేదని సమాచారం. అందుకే సల్మాన్ ఆమె ఇంటికి వచ్చి అల్లరి చేయాలని చూశాడంటారు.
సల్మాన్ విపరీత ధోరణి ఎంతకు దిగజారిందంటే.. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న చల్తే చల్తే సినిమా సెట్స్‌కు వచ్చి, షూటింగ్లో ఉన్న ఆమెను బయటకు ఈడ్చుకు రావడానికి ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకున్న షారుఖ్‌ను తోసేశాడు. ఈ గొడవ ఎందుకనుకొని, ఆ సినిమాలోంచి ఐశ్వర్యను తీసేసి, రాణీ ముఖర్జీని తీసుకున్నారు. ఆ చర్యతో సల్మాన్‌కు పూర్తిగా బ్రేకప్ చెప్పింది ఐశ్వర్య. వివేక్ ఓబరాయ్‌కు దగ్గరయ్యింది. అయినా సల్మాన్ ఆమెను వదలలేదు. ఆ తర్వాత వివేక్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ తనను వేధిస్తున్నాడని ఆరోపించాడు.
చివరకు వివేక్‌కు కూడా దూరమైంది ఐశ్వర్య. తర్వాత కాలంలో అభిషేక్ బచ్చన్‌కు సన్నిహితమైంది. ఎట్టకేలకు బచ్చన్ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టడంతో ఐశ్వర్య కథ సుఖాంతమైంది. ఆ జంటకు ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఏదేమైనా సల్మాన్-ఐశ్వర్య బిట్టర్ లవ్ స్టోరీని ఇప్పటికీ బాలీవుడ్ జనాలు మర్చిపోలేదు. తన జీవితంలో సల్మాన్ చాప్టర్ ఒక భయానకమైన రాత్రి వంటిదని ఒకసారి ఐశ్వర్య అభివర్ణించింది.
Also Read