Home

»

Bollywood News

అమితాబ్ బచ్చన్ హెల్త్ ట్వీట్ కలకలం.. పోరాడేవారే ఎప్పటికి విజేతలు

Jul 21, 2026 4:07PM

 

 

భారతీయ సినిమాకి సరికొత్త జోష్ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్. హిందీ చిత్ర పరిశ్రమ అయితే అమితాబ్ రుణాన్ని తీర్చుకోలేదు. అంతలా దశాబ్దాల నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అమితాబ్ 'ఎక్స్' వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో "ఆస్పత్రిలో సర్జరీ, ఆపై ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ. ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకోవడం. రికవరీ సమయం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టమైన దశ. ఒక రోజు హఠాత్తుగా ఓటమి మన ఎదుట నిలుస్తుంది. అయితే ధైర్యంగా పోరాడేవారే ఎప్పటికీ విజేతలుగా నిలుస్తారు  అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ అభిమానులని షాక్ కి గురి చేస్తున్నాయి. దీనికి తోడుగా  'ఎక్స్' వేదికగా "T 5806 - ద గేమ్ హాస్ ఎండెడ్! బట్ ద వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్" అని ట్వీట్ చేయడంతో, బిగ్ బీకి ఏమైంది? ఆయన నిజంగానే ఆస్పత్రిలో చేరారా? అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. అమితాబ్ వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. గతంలో కూడా ఆయన అనేక ఆరోగ్య సవాళ్లని ఎదురుకొని చిరంజీవిగా తిరిగొచ్చారు.

Also read: బాలకృష్ణ గాయాలపై ఎన్టీఆర్ ట్వీట్ ఇదే.. ఏం చెప్పాడంటే!

Amitabh bachchan, health update

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com