
బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)నిన్న సోషల్ మీడియా వేదికగా 'శస్త్రచికిత్స, ఐసీయూ, కోలుకునే ప్రక్రియ గురించి ఒక పోస్ట్ చేసాడు. దీంతో అమితాబ్ అనారోగ్యానికి గురయ్యారా అని అభిమానులతో పాటు భారతీయ సినీ ప్రేమికులు, శ్రేయోభిలాషులు షాక్ కి గురయ్యారు. ఆ ప్రచారాలపై అమితాబ్ ఎక్స్ క్లూజివ్ గా పూర్తి క్లారిటీ ఇచ్చారు.
'నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను, నాకు ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు, ఐసీయూలో కూడా చేరలేదు. నేను చేసిన పోస్ట్‌ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నా రు .ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమి పాలైన సమయంలో, ఆ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేదనను, క్రీడాకారుల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానంగా మాత్రమే నేను సర్జరీ, ఐసీయూ ఉదాహరణని పేర్కొన్నాన్నాను.
Also read: మా ఇంటి బంగారంతో సమంత జాక్‌పాట్.. ఇంకా 100 కోట్ల మార్క్ దాటలేదా?
ఒక వైపు తీవ్రమైన గాయం లేదా సర్జరీ తర్వాత శరీరం బలహీనపడితే దాన్ని అంగీకరించడం ఎంత కష్టమో, ఒక గొప్ప విజేత ఓటమిని చవిచూసినప్పుడు ఆ మానసిక స్థితిని జయించడం కూడా అంతే కష్టమని వివరించడమే నా ముఖ్య ఉద్దేశం. అభిమానులు దాన్ని తన సొంత ఆరోగ్య పరిస్థితికి ముడిపెట్టి ఆందోళన చెందడంపై ఆయన చిరునవ్వుతో స్పందిస్తూ, "ప్రస్తుతానికి నేను చాలా బాగున్నాను" అని తన మార్కు హాస్యచతురతతో చెప్పడం జరిగింది.
Amitabh Bachchan, bollywood




